నేటినుండి మహాలక్ష్మీ రాజయోగంతో వీరింట సంపదల సంక్రాంతి

జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ అనేక రాజ యోగాలను సృష్టిస్తూ ఉంటాయి. కొన్ని శుభ యోగాలు కాగా, మరికొన్ని అశుభ యోగాలను కూడా సృష్టిస్తాయి. డిసెంబర్ 19 రాత్రి పది గంటల యాభై నిమిషాలకు చంద్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు.

మహాలక్ష్మీ రాజయోగం
అప్పటికే ధనుస్సు రాశిలో కుజుడు, సూర్యుడు, శుక్రుడు ఉండడం వల్ల రాత్రి మహాలక్ష్మి రాజయోగం, లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడ్డాయి. ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారు అనేక శుభ ఫలితాలను పొందుతారు. మహాలక్ష్మి రాజయోగం కారణంగా నేటి నుంచి అదృష్టవంతులు అయ్యే ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

luck and happiness to these zodiac signs from today with mahalakshmi rajyoga

కన్యారాశి
కన్యారాశి వారికి నేటినుంచి మంచి జరుగుతుంది. మహాలక్ష్మి రాజయోగం కారణంగా వీరికి వాహనాలు, ఆస్తులు సంపాదించే యోగం ఉంది. ఇక విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. రాజకీయాలలో ఉన్నవారికి ముఖ్య బాధ్యతలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు వస్తాయి. జీతం పెరిగే అవకాశం ఉంది. కెరీర్ మీకు సంతృప్తికరంగా ఉంటుంది. కన్యారాశి జాతకులు విలాసాల కోసం ఖర్చు చేస్తారు. ఈ సమయం మీకు అన్ని విధాల లబ్ధి చేకూరుస్తుంది.

ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారు నేటి నుంచి శుభ ఫలితాలను పొందుతున్నారు. మీరు చేసే పని అందరి మన్ననలు పొందుతుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగం చేసే వారికి పదోన్నతులు వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ఊహించిన దాని కంటే మంచి లాభాలు వస్తాయి. జాతకంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. ఈ సమయంలో కోరుకున్న కోరికలు తీరుతాయి.

కుంభరాశి
కుంభ రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం కలిసి వస్తుంది ఈ రాశిలో 11వ ఇంట్లో కుజుడు చంద్రుడు కలిసి ఉండడం వల్ల సానుకూల ప్రభావాలు చూడవచ్చు. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. కెరీర్లో లాభాలు వస్తాయి . కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పని ప్రశంసించబడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. మీ పొదుపు సామర్థ్యం పెరుగుతుంది. ఇది అన్ని విధాల మేలు చేకూరుస్తుంది.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+