పితృదేవతలను సంతృప్తి పరచే మహాలయ పక్షమి
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
శ్లో. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ;
సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే !
భావం:- ఎవరి వలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో, ఎవరి ఆశీస్సుల వలన సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు.
'అపుత్రస్య గతిర్నాస్తి' అనగా పుత్ర సంతానం లేనిదే పితురులకు ఉత్తమ లోకాలు ప్రాప్తించవు అని వేద ప్రవచనం. 'పున్నామ నరకాత్ త్రాయత ఇతి పుత్రః ' పున్నామ నరకం నుండి రక్షించువాడు పుత్రుడు. భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం. అందుకే దీనిని పితృపక్షంగా వ్యవహరిస్తారు.

పూర్వం దేవదానవులకు భాద్రపద పాడ్యమి నుంచి అమావాస్య దాకా యుద్ధం జరిగింది. ఆ నెలరోజుల్లోని రెండో సగంలో ఎంతో మంది దేవతలూ మునులూ మరణించారు. కాబట్టి దాన్ని 'మహాలయం' అన్నారు. అదే 'మహాలయ పక్షం' అయినది. అందుకే ఈ పదిహేనురోజులూ ఎలాంటి శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షమంతటా నిత్యం తర్పణాలు వదలడం, శ్రాద్ధ విధులు నిర్వహించడం, పిండప్రదానం చేయడం ద్వారా పితృదేవతలను ఆరాధించాలని పురాణప్రవచనం. అలా పక్షమంతా చేయడం కుదరని వారు మహాలయ అమావాస్య నాడైనా అన్నశ్రాద్ధం పెట్టాలనీ అదీ కుదరనివారు హిరణ్యశ్రాద్ధం చేయవచ్చనీ, అది కూడా చేసే తాహతులేనివారు పితృదేవతలను తలచుకుని నమస్కారము చేసుకోవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
మహాలయ పక్ష ప్రారంభం / కృష్ణ పాడ్యమి పితృ పక్షం మొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలు పూజలకు ఉద్దేశించినవి.
పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం, పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబంలో స్త్రీ కి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబంలోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు మొదలైనటువంటివి.
ప్రతి మనిషీ తన జీవితంలో పితృఋణం తీర్చాలి. దీని వలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృఋణం తీర్చక పొతే వారికి ముక్తి లభించదు. మహాలయపక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి. సంతృప్తి చెందిన పితృ దేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది. ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి చేయకూడదు. మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి.ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధ కర్మ నిర్వర్తించటం చేత పితరులకు తృప్తి కలుగుతుంది. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది. పితరులను ఉద్దేశించి, వారి ఆత్మను తృప్తి పరచటానికి శ్రద్దతో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది. పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం తప్పని సరి విధి.
శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు వాయురూపంలో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర, పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించక పొతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు.

నిజానికి, ప్రతి మాసంలోను అమావాస్య, పితరుల పుణ్య తిథిగా భావించబడినా, మహాలయ అమావాస్య కు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది. తమ పితరుల పుణ్య తిథి వివరాలు తెలియనివారు, పితృ పక్షంలో ఆ తిథి నాడు ఏదైనా కారణం చేత శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు. ఎవరూ శ్రాద్ధ విముఖులు కాకూడదు. శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఆదర పూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మలో నువ్వులు, గూడమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాల లోను అన్న దానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది, కాని ఈ మహాలయపక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది. ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లబిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా తెలుసుకోవచ్చు.
1. పాడ్యమి 18 సెప్టెంబర్ 2024 బుధవారం రోజు
శ్రాద్ధ కర్మ చేయటం వలన ధన సంపద లభిస్తుంది.
2. ద్వితీయ 19 సెప్టెంబర్ 2024 గురువారం రోజు
శ్రాద్ధ కర్మ చేయటం వలన రాజయోగం, సంపద లభిస్తుంది.
3. తృతీయ 20 సెప్టెంబర్ 2024 శుక్రవారం రోజు
శ్రాద్ధ కర్మ చేయటం వలన శత్రువులు నశిస్తారు.
4. చతుర్ది 21 సెప్టెంబర్ 2024 శనివారం రోజు
శ్రాద్ధ కర్మ చేయటం వలన ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది.
5. పంచమి 22 సెప్టెంబర్ 2024 ఆదివారం రోజు
శ్రాద్ధ కర్మ చేయటం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పుత్రకామన గలవారికి ఫలం లభిస్తుంది.
6. షష్ఠి 23 సెప్టెంబర్ 2024 సోమవారం రోజు
శ్రాద్ధ కర్మ వలన దేవతలు పితరులు ప్రసన్నులవుతారు, ఆ వ్యక్తికి సమాజం లో శ్రేష్ఠ గౌరవం లభిస్తుంది.
7. సప్తమి 24 సెప్టెంబర్ 2024 మంగళవారం రోజు శ్రాద్ధ కర్మ వలన యజ్ఞం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది.
8. అష్టమి తిథి 25 సెప్టెంబర్ 2024 బుధవారం రోజు
శ్రాద్ధ కర్మ వలన చేస్తే సంపూర్ణ సమృద్ధి, ధనం, బుద్ది ప్రాప్తిస్తాయి.
9. నవమి 26 సెప్టెంబర్ 2024 గురువారం రోజు
శ్రాద్ధ కర్మ చేస్తే విస్తారంగా సంపద, భార్య అనుకూలత లభిస్తుంది.
10. దశమి 27 సెప్టెంబర్ 2024 శుక్రవారం రోజు
శ్రాద్ధ కర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ది చెందుతుంది.
11. ఏకాదశి 28 సెప్టెంబర్ 2024 శనివారం రోజు
శ్రాద్ధ కర్మ చేస్తే సర్వ శ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది, అన్ని పాపాలు నశిస్తాయి, వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది , కుటుంబం వృద్ది చెందుతుంది.
12. ద్వాదశి 29 సెప్టెంబర్ 2024 ఆదివారం రోజు
శ్రాద్ధ కర్మ చేస్తే దేశం అబివృద్ది చెందుతుంది. శ్రాద్ధ కర్తకు అన్నానికి లోటుండదు, అలాగే పుత్ర, బుద్ధి, జయ సంపత్తి కలుగుతుంది.
13. త్రయోదశి 30 సెప్టెంబర్ 2024 సోమవారం రోజు
శ్రద్ద కర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం , బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి.
14. చతుర్దశి 1 అక్టోబర్ 2024 మంగళవారం రోజు
శ్రాద్ధ కర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది.
15. అమావాస్య 2 అక్టోబర్ 2024 బుధవారం రోజు
శ్రాద్ధ కర్మ చేస్తే వ్యక్తి కి సమస్త లాభాలు కలుగుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి.
ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్దాలు ఈ మహాలయపక్షం. పదిహేను రోజులు దానాలు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి.
ఆర్దిక ఇబ్బందుల వలనకానీ ఇకా ఇతర కారణాల వలన కానీ శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే కనీసం ఈ పితృ పక్షంలో కేవలం శాకంతో అయిన శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చును. అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాన్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి, పితృ దేవతలకు నమస్కరించవచ్చును. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. ఈ పిత్రుపక్షంలో కాశీ, ప్రయాగ పుణ్యక్షేత్రాలలో తర్పణాలు విధివిధానంగా మా వేదపండితులచే నిర్వహింపబడును, ఆసక్తి కలవారు 9440611151 నంబరుకు సంప్రదించండి.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
వాస్తు ప్రకారం కిచెన్లో పూజ చేయవచ్చా? -
ఉగాది నుండి వీరికి ధనయోగం.. బిజినెస్ అద్భుతం.. వృషభరాశి జాతకమిలా! -
మీన, కుంభ రాశులలో ముఖ్య గ్రహాలు.. వీరికి నేడు డబ్బులే డబ్బులు! -
పరాభవ నామ ఉగాది పంచాంగం.. మేషరాశి వారి జాతకం! -
ఉగాది నుండి అదృష్టం పట్టబోతున్న రాశులు ఇవే! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications