డిసెంబర్ లో వీరికి కనకవర్షం కురిపిస్తానని కుజుడి సందేశం!
కాలానుగుణంగా ప్రతి గ్రహం తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం ఒక్కొక్కసారి ప్రత్యక్షంగాను ఒక్కొక్కసారి తిరోగమన దిశలోను కదులుతూ సాగుతుంది. అయితే ఈ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన ముఖ్య గ్రహమైన కుజుడు తిరోగమనంలోకి వెళతాడు. దీని కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరికి సిరిసంపదలు, సుఖ శాంతులు వస్తాయి. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
కర్కాటక రాశి
కుజుడి తిరోగమన సంచారం కారణంగా కర్కాటక రాశి వారి జీవితాలలో గణనీయమైన మార్పులు వస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు ఏ రంగంలో అయినా అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు వారి సామర్థ్యం పెరుగుతుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కోర్టు సమస్యల నుంచి కర్కాటక రాశి జాతకులు బయటపడతారు. ఈ సమయంలో వీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

మేష రాశి
కుజుని తిరోగమన సంచారం కారణంగా మేష రాశి వారికి కలిసి వస్తుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో మంచి ఆదాయాన్ని సంపాదిస్తారు. వర్ధక వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. విదేశాలలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ఉద్యోగస్తులకి పదోన్నతులు లభిస్తాయి. పెళ్ళికాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. నూతన, వాహనాలు ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఇది వీరికి సంపన్న కాలం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కుజ గ్రహం తిరోగమనం కారణంగా ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వీరి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఇల్లు కొనాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. విదేశీ విద్య కోసం ఎదురుచూస్తున్న వారి కలలు నెరవేరుతాయి. తల్లిదండ్రులు ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు. వివాహాలు చేయాలనుకుంటే ఇదే అనుకూలమైన సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications