ఈనెల 20 నుంచి ఈ రాశులకు డబ్బే డబ్బు.. అంతా మంగళుడి దయ

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటుంది. ఇలా సంచారం చేసే సమయంలో కొన్ని రాశులకు మంచి ఫలితాలు, మరికొన్ని రాశులకు వారి కర్మలనుబట్టి అశుభ ఫలితాలు కలుగుతుంటాయి. గ్రహాల సంచారంలో మంగళుడి సంచారం చాలా ప్రధానమైంది. ఎంతో శుభసూచికంగా భావించే మంగళుడు ఈనెల 20వ తేదీన మధ్యాహ్నం 3.00 గంటలకు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుండటంతో నాలుగు రాశులకు అద్బుతంగా ఉండబోతోంది. ఆరోజు నుంచి వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. వాటిగురించి తెలుసుకుందాం.

వృషభరాశి
వీరికి ఊహించనిరీతిలో లాభాలు కలుగుతున్నాయి. చేపట్టిన ప్రతి పని విజయవంతంగా ముగుస్తుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది.. దాంతోపాటు వేతనం పెరుగుతుంది. అడుగడుగునా వీరికి అదృష్టం తోడుండటంతో వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు.

mars transit capricorn four zodiac signs are very lucky and will get unlimited money

వృశ్చిక రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది ఎంతో అనువైన సమయం. అనారోగ్యం తగ్గుతుంది. నిలిచిపోయిన డబ్బు చేతికి అందడంతోపాటు వ్యాపారస్తులకు భారీగా లాభాలు వస్తాయి.

మకర రాశి
ఈనెల 20 నుంచి మంగళుడు ఈ రాశిలోకే ప్రవేశించనున్నారు. పెట్టిన పెట్టుబడులకు మంచి ఆదాయం వస్తుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ రాశివారికే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి మంచిరోజులు ప్రారంభమైనట్లే. ఉద్యోగస్తులకు పదోన్నతితోపాటు వేతనం పెరగడం, పై అధికారుల నుంచి మద్దతు లభించడం జరుగుతుంది.

కర్కాటక రాశి
ఈ నెల 20వ తేదీ నుంచి ఈ రాశివారి దశ తిరిగిపోతోంది. వీరు ఎక్కడ అడుగుపెట్టినా అక్కడివారంతా వీరికి నీరాజనాలు పలకడంతోపాటు ఊరేగించినంత పనిచేస్తారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగంతోపాటు ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటారు. మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+