జ్యేష్ట నక్షత్రంలో బుధుడు: ఈ రాశులవారికి అదృష్టం!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం వివిధ రాశుల వారి జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. డిసెంబర్ 13వ తేదీన జ్యేష్ఠ నక్షత్రంలో మూల యోగం ఏర్పడింది. దీనివల్ల మేష రాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, ధనుస్సు రాశి మరియు మీన రాశిలో జన్మించిన వారికి ప్రయోజనాలు కలుగుతాయి.

జ్యేష్ఠ నక్షత్రం వివిధ రాశుల వారికి తేజస్సును మరియు నాయకత్వ లక్షణాలను అందిస్తుంది. ఇది మానసికంగా తీవ్రమైన భావాలకు కారణంగా ఉంటుంది. కాబట్టి అన్ని రాశుల వారు అతిగా ఆలోచించే అవకాశాలు లేకుండా ఆలోచనల తీవ్రతను సమతుల్యం చేసుకోవలసిన అవసరం ఉంటుంది.

Mercury in Jyeshta Nakshatra: Lucky for these zodiac signs

చంద్రుడు బుధుడి రాశి అయిన కన్యా రాశిలోకి ప్రవేశించిన సమయంలో మూల యోగం ఏర్పడుతుంది. జ్యేష్ఠ నక్షత్రంలో మూల యోగం ప్రభావంతో మేష రాశి వారికి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ఏ పనులు చేయాలన్న సలహా తీసుకొని చేయడం మంచిది. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఆర్థికంగా అనుకూలతలను కలిగిస్తుంది.

వృషభరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వారు ఈ సమయంలో ఏ పని చేసినా సత్ఫలితాలను ఇస్తుంది. అయితే పనులు అనాలోచితంగా చెయ్యకూడదు అనేది గుర్తుంచుకోవాలి. కర్కాటక రాశి వారికి జేష్ఠా నక్షత్రంలో మూల యోగం కలిసొస్తుంది. కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు తమకు అప్పగించిన పనులు నెరవేర్చడానికి గణనీయమైన కృషిని చేయాలి.

కర్కాటక రాశి వారికి ఆర్థిక ఆందోళనలు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఏ పని చేసినా అలోచించి చేస్తే ఫలితం ఉంటుంది.ధనుస్సు రాశి వారికి వృత్తిపరమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. వివిధ పనులు, ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

మరి ఈ సమయంలో అచంచలమైన నిబద్ధతతో వృత్తి వ్యాపారాలలో పని చేస్తారు. కుంభ రాశి వారికి వ్యాపార రంగంలో పురోగతి కలుగుతుంది. సవాళ్లు ఉన్నప్పటికీ వివిధ అంశాలలో పెరుగుదల, ఆర్ధిక ప్రగతి మెండుగా ఉన్నాయి. అయితే ఈ సమయంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+