బుధ నక్షత్ర గోచారం ప్రకటించింది వీరికి ఐశ్వర్యం, రాజభోగం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా ఏర్పడే ఖగోళ దృశ్యాలు అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తాయి. నిర్దిష్ట కాలవ్యవధిలో సంచరించే గ్రహాలు ద్వాదశ రాశుల వారి జీవితాలను మారుస్తాయి. ఇక ప్రస్తుతం నవంబర్ ఒకటవ తేదీన బుధుడు అనురాధ నక్షత్రంలోకి సంచారం మొదలు పెట్టాడు.
శని గ్రహానికి చెందిన అనురాధ నక్షత్రంలోకి బుధుడు
అనురాధ నక్షత్రంలో బుధ సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. అనురాధ నక్షత్రం శని గ్రహానికి సంబంధించిన నక్షత్రం. అనురాధ నక్షత్రానికి అధిపతి శని. బుధుడు అనురాధ నక్షత్రంలో సంచరించడం వల్ల ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధున రాశి
అనురాధ నక్షత్రంలోకి బుధ సంచారం కారణంగా మిధున రాశి జాతకులకు కలిసొస్తుంది. బుధుడు కమ్యూనికేషన్ కు సంబంధించిన గ్రహం .ఈ సమయంలో మిధున రాశి వారి కమ్యూనికేషన్ స్కిల్స్ మరింత పెరుగుతాయి. వీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వర్తక వ్యాపారాలు చేయాలనుకునే వారికి కూడా నూతన అవకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి.
కన్యారాశి
శని నక్షత్రమైన అనురాధ నక్షత్రంలోకి బుధసంచారం కారణంగా కన్యారాశి జాతకులకు కలిసొస్తుంది. కన్యారాశి వారు ఈ సమయంలో ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో ఆదాయాన్ని గణనీయంగా సంపాదిస్తారు. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. లాటరీలు కూడా తగిలే అవకాశం ఉంది. పూర్వీకుల నుండి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. ఊహించని విధంగా బంధువులు, కుటుంబసభ్యుల నుంచి మీకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
మకర రాశి
శని నక్షత్రమైన అనూరాధ నక్షత్రం లోకి బుధ సంచారం కారణంగా మకర రాశి జాతకులకు కలిసొస్తుంది. ఈ సమయంలో మకర రాశి వారు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మకర రాశి వారి వ్యాపారం లాభాల బాటలో సాగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో చేసుకునే ఒప్పందాలు కలిసి వస్తాయి. భారీ ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications