నవ పంచమ రాజయోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ ఉంటాయి. అటువంటి గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతున్నప్పుడు వివిధ రాశులతో కలిసి కొన్ని యోగాలను ఏర్పరుస్తాయి. అవి కొన్ని శుభ యోగాలు కాగా మరికొన్ని అశుభ యోగాలు. ఏప్రిల్ మాసంలో బృహస్పతి బుధుడు తో సంయోగం చెంది నవ పంచమ రాజయోగాన్ని ఏర్పరిచాడు.
బుధుడు గురువు కలయికతో నవ పంచమ రాజయోగం
ఏప్రిల్ మూడవ తేదీ సాయంత్రం 4 గంటల 55 నిమిషాలకు బుధుడు, గురువు రెండు ఒకదానికొకటి 120 డిగ్రీల వ్యవధిలో వచ్చినప్పుడు నవ పంచమ రాజయోగం ఏర్పడింది. దీనివల్ల నేటి నుండి ఐదు రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

కర్కాటక రాశి
కర్కాటకరాశి వారికి నవ పంచమ రాజయోగం కలిసి వస్తుంది. ఈ సమయంలో కర్కాటకరాశి జాతకులు ఏ పని చేసిన అదృష్టం వరిస్తుంది. కర్కాటక రాశిలో గురువు 12 మరియు బుధుడు ఎనిమిదవ గృహంలో సంచరించడం వల్ల జీవితంలో వీరికి సకల సంతోషాలు అందుతాయి. వీరు ఆధ్యాత్మిక మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది. పుణ్యక్షేత్ర సంచారం చేసే అవకాశం ఉంది. భౌతికసుఖాలు కూడా లాభిస్తాయి. విద్యార్థులకు ఈ సమయంలో లాభదాయకంగా ఉంటుంది.
తులారాశి
తులా రాశి వారికి నవ పంచమ రాజ యోగం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ రాశిలో 9వ గృహంలో గురుడు, అయిదవ గృహంలో బుధుడు ఉండడం వల్ల వీరి యొక్క అదృష్టం ప్రకాశిస్తుంది. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో ధన లాభాలు వస్తాయి. వైవాహిక జీవితంలో మంచి జరుగుతుంది.
మీన రాశి
మీన రాశి వారికి నవ పంచమ రాజయోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీనరాశిలో నాలుగవ గృహంలో గురువు, 12వ గృహంలో బుధుడు ఉండడం వల్ల తల్లిదండ్రుల నుంచి వీరికి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. వాహనాలు, గృహాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో జీవిస్తారు. తల్లి ఆరోగ్యం కొద్దికొద్దిగా మెరుగుపడుతుంది. ఉద్యోగాలు చేసే వారికి కార్యాలయాలలో గౌరవ మర్యాదలు దక్కుతాయి.
కుంభరాశి
కుంభ రాశిలో లాభ గృహంలో బుధుడు, పంచమ గృహంలో గురువు ఉండడం వల్ల వీరికి కలిసి వస్తుంది. ఈ నవ పంచమ రాజయోగం కారణంగా కుంభరాశి జాతకులు వృద్ధిని పొందుతారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. సంపాదన పెరుగుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఉద్యోగాలలో బదిలీ అవకాశం కనిపిస్తుంది. ఇది కుంభ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి నవ పంచమ రాజయోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ధనుస్సు రాశిలో ఏడవ గృహంలో గురువు, మూడవ గృహంలో బుధుడు ఉండడం వల్ల ఇది ధనుస్సు రాశి జాతకులకు అన్ని విధాల శ్రేయస్సును కలుగజేస్తుంది. వీరి వైవాహిక జీవితం ఈ సమయంలో బాగుంటుంది. సంపాదన వృద్ధి కలుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications