నిర్జల ఏకాదశి 2025: లక్ష్మీ అనుగ్రహం కావాలంటే ఈ పనులు అస్సలే చెయ్యొద్దు!
హిందూమతంలో ఏకాదశికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. హిందువులు ఏకాదశిని చాలా పుణ్యదినంగా భావిస్తారు. ప్రతి నెలలోనూ 2 రెండు ఏకాదశులు వస్తాయి. అయితే ఒక్కొక్క మాసంలో వచ్చే కొన్ని ఏకాదశులు చాలా ప్రత్యేకమైనవి. జేష్ఠ మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజు చాలా విశిష్టమైంది. ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి జూన్ 6వ తేదీన వస్తుంది.
నిర్జల ఏకాదశి వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం
నిర్జల ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే లక్ష్మీకటాక్షం కలుగుతుందని నమ్ముతారు. నిర్జల ఏకాదశి అంటే జలాన్ని కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేసే రోజు. లక్ష్మీదేవి ఆరోజు శ్రీమహావిష్ణువు కోసం ఉపవాసం చేస్తుందని, అదే రోజు ఎవరైతే నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి లక్ష్మీదేవి సకల సంపదలను అనుగ్రహిస్తుందని చెబుతారు. అయితే నిర్జల ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు తులసిమొక్క దగ్గర కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు.

తులసి వద్ద ఈ పొరబాట్లు చెయ్యొద్దు
ఒకవేళ అలా తులసి మొక్క దగ్గర పొరపాట్లు చేస్తే వారు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిర్జల ఏకాదశి రోజు తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు . ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవి ఉపవాసం ఉంటుంది కాబట్టి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మనమంతా నమ్ముతాం కాబట్టి ఆరోజు తులసి మొక్కకు నీళ్లు పోస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. కనుక ఆరోజు తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు.
ఈ పనులు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం
తులసి ఆకులను తుంచకూడదు. తులసి ఆకులను గోళ్ళతో గిల్లుతూ తుంచడం మహా పాపంగా చెప్పబడింది. మురికి చేతులతో, మైల పడిన శరీరంతో, స్నానం చేయకుండా, ఎప్పుడు పడితే అప్పుడు తులసి ఆకులను తుంచితే లక్ష్మీదేవి ఆగ్రహించి దరిద్రాన్ని అనుగ్రహిస్తుంది. కనుక నిర్జల ఏకాదశి రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు.
నీళ్ళు తాగకుండా ఉపవాస దీక్ష చేస్తే సిరి సంపదలు
అంతేకాదు తులసి మొక్క ఉన్నచోట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెప్పులు, బూట్లు వంటివి తులసి మొక్క దగ్గర విడవకుండా చూసుకోవాలి. భక్తి ప్రపత్తులతో లక్ష్మీదేవిని పూజించాలి. ఆరోజు నైవేద్యాన్ని నివేదించకూడదు. నీళ్లు కూడా తాగకుండా అత్యంత నిష్టతో ఉపవాస దీక్షను ఆచరిస్తే లక్ష్మీ కరుణిస్తుంది. మిమ్మల్ని సిరిసంపదలతో అనుగ్రహిస్తుంది.
disclaimer: ఈ కథనం పండితుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications