ఓం శాంతి శాంతి శాంతిః.. మూడుసార్లు ఎందుకంటాం?

కాలేవర్షతు పర్జన్య: పృధివీ సస్యశాలినీ
దేసోయం క్షోభరహిత: రాజానస్సంతు నిర్ణయా:

మనం మంత్రం చివరిలో ' ఓం శాంతి శాంతి శ్శాంతి: ' అని అంటారు ఎందుకు... .?

ఏ ప్రార్థన చివరిలో అయిన మనం ఓం శాంతి శాంతి శ్శాంతి: అని మూడుసార్లు అంటుంటాం. ఆ విధంగా మూడుసార్లు అనడం ద్వారా మూడు రకాలతాపాలు (బాధలు) తొలగాలని భగవంతుడిని ప్రార్థించడమన్నమాట.

om shanthi shanthi shanthi hi: what is good and what is bad?

ఓం శాంతి: అంటే సర్వ ప్రజలు,ప్రాణులు సుఖంగా జీవింతురు గాక అని భావం

ఓం శాంతి: అంటే పరిపాలకులు ధర్మన్యాయ పద్ధతులను అనుసరించి పాలించేదరు గాక అని భావం

ఓం శాంతి: అంటే సకాలంలో వర్షాలు పడి సకలం సంతోషదాయకమై ,ఎలాంటి ఉపద్రవాలు లేకుండా లోకాలన్నీ సుఖజీవనం సాగించుగాక అని భావం.

మనం దేవుని పూజించినప్పుడు మనకోసమే కాకుండ మనతో సహా జీవింవించే సాటి ప్రాణులను,ప్రకృతిని ఈ సృష్టిలోని సమస్తం బాగుండాలని కోరుకుంటేనే మనం బాగుంటాం.అందరూ బాగుంటే అందులో మనం బాగుంటాం.కేవలం మనమే బాగుండాలి అంటే అది రాక్షసత్వం అవుతుంది.

ఇక్కడ ఒకటి ఆలోచించాల్సింది ఒకటుంది.మనం కోరుకునేది శాశ్వతమైన దైవత్వ ఆనందమా...లేక అ శాశ్వతమైన రాక్షసత్వ స్వభావమా... మంచి నిలుస్తుంది.చెడు పడిపోతుంది.దేహతృప్తి కంటే ఆత్మతృప్తి గోప్పది.మనం చేసే పనిలో ఏది మంచి,చెడు అనే విషయం మన అంతరాత్మ చెబుతుంది,అది గమనించుకుని వ్యవహరిస్తే చాలు అంతా మంచి జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.
--- డా.యం.ఎన్.చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు- 9440611151

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+