దీపావళి రోజు రూపాయి నాణెంతో ఇలా చేయండి... సంపద పెరుగుతుంది
హిందూ మతంలో దీపావళి పర్వదినానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ధన్ తేరస్ తో ప్రారంభమై భాయ్ దూజ్ రోజు ముగుస్తుంది. దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె సంతోషించి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దీపావళి పర్వదినాన లక్ష్మీదేవి, వినాయకుడిని పూజించడం సనాతన సంప్రదాయం. ఈరోజు లక్ష్మీదేవి భూమిని దర్శించుకుంటుంది. ఈ సందర్భంలో ఆ తల్లి ఆశీర్వాదం పొందడానికి దీపావళిరోజు రాత్రి కొన్ని పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తున్నారు. అవి అదృష్టాన్ని కూడా మారుస్తాయని చెబుతున్నారు.
ఒక రూపాయి నాణెంతో : దీపావళి రోజు చేసే చిన్న చిన్న పనులు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తాయి. అయితే ఇవి చేయడానికి ఉన్న నియమాలను తెలుసుకోవాలి. లక్ష్మీదేవి, గణేశుడిని పూజించే సమయంలో రూపాయి నాణాన్ని కూడా పూజిస్తారు. ఇలా చేయడంవల్ల అదృష్టం ఎప్పుడూ వెంటే ఉంటుంది.

లక్ష్మీదేవి పూజ సమయంలో ఆమె పాదాలవద్ద ఒక రూపాయి నాణెం ఉంచాలి. పూజ పూర్తయిన తర్వాత ఇంటిమీద వెలుగుతున్న దీపం కింద ఉంచాలి. తర్వాతరోజు ఉదయం ఈ నాణాన్ని తీసుకొని జాగ్రత్త చేయాలి. ఇలా చేయడంవల్ల ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు.
జ్యోతిష్యం ప్రకారం లక్ష్మీదేవి పూజలో ఉంచిన ఒక రూపాయి నాణెం ఎరుపు రంగు దారంలో కట్టి మీ ఇంటిలో భద్రంగా ఉంచుకోవాలి. దీనివల్ల సంపద పెరుగుతుంటుంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి.
దీపావళిరోజు రాత్రి ఆవనూనె దీపం కింద ఒక రూపాయి నాణెం ఉంచి దీపం వెలిగించాలి. దీనివల్ల ప్రతి పనిలో విజయం దక్కుతుంది.
ఒక రూపాయి నాణాన్ని కుంకుమ, అక్షింతలు, కల్వేపై ఉంచాలి. పూజ తర్వాత ఈ నాణాన్ని డబ్బు దాచే ప్రదేశంలో భద్రపరచాలి. ఇలా చేయడంవల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి.












Click it and Unblock the Notifications