ఉగాది నుండి అదృష్టం పట్టబోతున్న రాశులు ఇవే!
ఉగాది నుండి కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రహాల సంచారం, గురు మరియు శుక్ర గ్రహాల ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థికంగా కలిసి వస్తుందని అంటున్నారు. ఉద్యోగంలో మరియు కుటుంబ జీవితంలో మంచి మార్పులు కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి.
గ్రహాల సంచారం ప్రభావం
2026 సంవత్సరంలో ఉగాది తర్వాత గ్రహస్థితులు మారడం వల్ల కొందరికి ప్రత్యేకమైన యోగాలు ఏర్పడతాయని చెబుతున్నారు. దీని వల్ల గతంలో ఎదురైన అడ్డంకులు తొలగి కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని రాశులవారికి ఈ కాలంలో ఉద్యోగంలో ప్రమోషన్, కొత్త అవకాశాలు, వ్యాపార విస్తరణ వంటి ప్రయోజనాలు కలగవచ్చని చెబుతున్నారు.

ఈ రాశులవారికి ఉగాది నుండి పండుగే
పరాభవ నామ ఉగాది మార్చి 19 న ప్రారంభం అవుతుంది. అప్పటి నుండి వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. కొన్ని రాశులలో పెట్టుబడులు పెట్టే వారికి కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రెండు రాశులవారికి ఈ ఉగాది నుండి కలిసివస్తుందని అంటున్నారు. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
మిధునరాశి
వచ్చే ఉగాది నుండి మిధునరాశి జాతకులకు కలిసి వస్తుంది. ఇప్పటివరకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి ఉగాది తర్వాత పరిస్థితులు మెరుగుపడే అవకాశముందని చెబుతున్నారు. అప్పులు తగ్గడం, ఆదాయం పెరగడం, కొత్త సంపాదన మార్గాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గి సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మిధునరాశి జాతకులకు వివాహ యోగాలు, శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
తులారాశి
వచ్చే ఏడాది నుండి తులారాశి జాతకులకు అన్ని విధాలా శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో తులారాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వర్తక, వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఉగాది నుండి ఈ రాశి వారి కష్టాలు తొలగిపోతాయి. పెట్టుబడులు పెట్టిన వారికీ లాభాలు వస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల కూడా నెరవేరుతుంది. ఈ సమయంలో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు .
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications