ఈ 4 రాశులవారిపై రాహు కేతువుల చల్లని చూపు- కనకవర్షమే ఇక
జ్యోతిష్యంలో పాప గ్రహాలుగా పరిగణించే రాహువు, కేతువులు త్వరలో తమ నక్షత్ర స్థానాలను మార్చుకోనున్నాయి. హిందూ పంచాంగం ప్రకారం, ఈ రెండు ప్రధాన గ్రహాలు ఒకే రోజు నక్షత్రాలను మారడం జ్యోతిష్య విశేషంగా భావిస్తారు. మార్చి 29వ తేదీన ఈ రాహు- కేతు గోచారం సంభవించబోతోంది. ఈ నక్షత్ర పరివర్తనం నాలుగు రాశుల వారికి అపారమైన శుభ ఫలితాలు, ఉన్నతికి కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మార్చి 29వ తేదీన కేతువు మఘా నక్షత్రంలోకి ప్రవేశించగా, రాహువు శతభిష నక్షత్రం రెండో పాదంలోకి తన స్థానాన్ని మార్చుకోనుంది. ఈ గ్రహాల గోచార స్థితి నాలుగు రాశుల వారికి అసాధారణమైన అదృష్టాన్ని తీసుకువస్తుందని, వారి జీవితాలలో సానుకూల మార్పులను ప్రోత్సహిస్తుందని జ్యోతిష్య నిపుణులు వివరించారు.

మేష రాశి: మేష రాశి వారికి రాహువు, కేతువుల నక్షత్ర మార్పు గణనీయమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. ఆకస్మిక ధన లాభం పొందుతారు. ఖర్చులు తగ్గుతాయి. కార్యాలయాలు, వ్యాపారసంస్థలు, పని చేసే చోట సానుకూల ప్రభావం పెరుగుతుంది. ఉద్యోగుల ఆలోచనలు గొప్పగా ఉంటాయి. అవి కార్యరూపం దాల్చుతాయి. దూర ప్రయాణాల ద్వారా ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం వెల్లివిరుస్తుంది.
మిథున రాశి: మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితిలో ఊహించని మెరుగుదల కనబడుతుంది. ఆస్తి కొనుగోలు లేదా అమ్మకాలకు ఈ సమయం చాలా అనుకూలం. కోర్టు కేసు పరిష్కారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. మీ మనస్సు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. బంధుమిత్రులతో సంబంధాలను బలపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. భాగస్వామితో కలిసి ప్రయాణం కూడా విజయవంతంగా సాగుతుంది.
వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి ఈ నక్షత్ర మార్పు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. శత్రువులపై విజయం సాధించి, వారి కుట్రలను విజయవంతంగా తిప్పికొడతారు. ఆర్థికంగా లాభపడే మంచి అవకాశాలు లభిస్తాయి. పొదుపు, పెట్టుబడి పథకాలు విజయవంతంగా పూర్తవుతాయి. దీర్ఘకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ప్రేమ సంబంధాలలో ఆనందం, అనుకూలమైన కలయికలు గోచరిస్తాయి.
మీన రాశి: మీన రాశి వారికి ధనధాన్యం పెరుగుదలకు అవకాశాలున్నాయి. ధనాన్ని సులభంగా పొదుపు చేయగలుగుతారు. ఖర్చులు తగ్గడంతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. తల్లిదండ్రులు లేదా పెద్దవారితో ఉన్న విభేదాలు తొలగి, కుటుంబంలో ఐక్యత నెలకొంటుంది. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి కుటుంబం నుండి ఆమోదం లభిస్తుంది. ఇది ప్రత్యర్థుల ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. విదేశీ ప్రయాణ యోగాలు కూడా ఉన్నాయి.
Disclaimer: రోజువారీ జీవితంలో జ్యోతిష్యం, రాశులు, గ్రహస్థితి ప్రభావం గురించి తెలియజేయడానికి ఉద్దేశించిన కథనం ఇది. వీటి గురించి మరింత సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవడానికి పండితులను సంప్రదించాలి.












Click it and Unblock the Notifications