సెప్టెంబర్ నెలలో ఏకకాలంలో గ్రహాల తిరోగమనం.. తీవ్ర ప్రభావం; పరిహారాలివే!!
సెప్టెంబర్ నెలలో ఏకకాలంలో గ్రహాలు తిరోగమన ప్రయాణం చేయడం వల్ల తీవ్రమైన ప్రభావాలు కలుగుతాయి. సెప్టెంబరు నాటికి రాహువు మేషరాశిలో ఉండగా, కేతువు తులా రాశిలో ఉంది. ఇవి రెండూ ప్రస్తుతం తిరోగమనంలో ప్రయాణం చేస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుతం శని కుంభరాశిలో తిరోగమనంలో ప్రయాణం చేస్తున్నాడు. బుధుడు సింహరాశిలో తిరోగమనంలో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.
మరోవైపు శుక్రుడు కూడా కన్య రాశి నుండి సింహరాశికి కదులుతూ దాని తిరోగమన కదలికను ప్రారంభించాడు.గురు గ్రహం కూడా సెప్టెంబర్ 4న తిరోగమనంలోకి మారి డిసెంబర్ 31వ తేదీ వరకు తిరోగమనంలోనే ప్రయాణం చేస్తుంది. ఇక ముఖ్యమైన గ్రహాల తిరోగమన సంచారం తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుంది.

వివిధ రాశుల వారికి రకరకాల చిక్కులకు కారణమవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి, వ్యాపారం చేసే వారికి ఇది లాభదాయకంగా ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే తిరోగమనంలో ప్రయాణం చేసే గ్రహాలను బలపరచడం కోసం అనేక పరిహారాలను చేయాలని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
ముఖ్యంగా శని గ్రహాన్ని బలపరచడానికి ప్రతి శనివారం నూనెను దానం చేయాలని, శివుని కాలభైరవ అవతారాన్ని పూజించాలని చెబుతున్నారు. అంతేకాదు శుక్రవారం తెల్లని దుస్తులు ధరించి ఉపవాసం ఉండడం వల్ల జాతకంలో శుక్రుడు బలపడతారని, శుక్ర బీజ మంత్రాన్ని పఠించడం వల్ల కూడా శుక్రుడు బలపడతారని, పరిమళ ద్రవ్యాలను ఉపయోగించడం, వెండి ఆభరణాలను ధరించడం వల్ల కూడా జాతకంలో శుక్రుడు బలపడతారని చెబుతున్నారు.
బుధుడు బలహీనంగా ఉన్నవారు బుధవారం పచ్చని వస్తువులను దానం చేయాలని, గణేశుడికి పచ్చి శనగలు సమర్పించి ప్రార్థన చేయాలని చెబుతున్నారు. ఇక జాతకంలో బృహస్పతిని బలపరచుకోవాలని భావించేవారు గురువారంనాడు పసుపు రంగు దుస్తులు ధరించి గురు బీజ మంత్రాన్ని పఠించాలని, విష్ణువుకు అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించి పూజించాలని, దానధర్మాలు చేయాలని చెబుతున్నారు. రాహు కేతువులను శాంతింప చేయాలని భావించేవారు ప్రతిరోజు శివపంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications