ఫిబ్రవరిలో వీరికి సంపదల కుంభవృష్టి.. ప్రకటించిన నిపుణయోగం!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి మాసంలో అనేక ఖగోళ యాదృచ్ఛికాలు జరగబోతున్నాయి. శని దేవుడిని కర్మలకు అధిపతిగా భావిస్తారు శని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి దాదాపు రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది. అదే విధంగా శని దేవుడు ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలోకి ప్రవేశించడానికి ఏడాది సమయం పడుతుంది. ఇక శని నక్షత్రసంచారం కూడా అన్ని రాశుల వారిపైన ప్రభావాన్ని చూపిస్తుంది.
నిపుణ యోగం
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యువరాజుగా పరిగణించే బుధుడు ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 9:53 నిమిషాలకు పూర్వభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇక ఇప్పటికే పూర్వభాద్ర నక్షత్రంలో శని దేవుడు ఉండటం వల్ల శని బుధుడి కలయిక జరుగుతుంది. ఈ రెండు గ్రహాల కలయిక నిపుణ యోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారికి అఖండ ధనయోగం కలుగుతుంది. నిపుణ యోగంతో అదృష్టవంతులయ్యే ఆ రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

మేష రాశి
మేష రాశి వారికి శనీశ్వరుడు బుధుడు కలయిక అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ రెండు గ్రహాలు కలిసి నిపుణయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ శుభయోగం వల్ల మేష రాశి వారికి వర్తక వ్యాపారాలలోనూ ఉద్యోగాలలోను కలిసి వస్తుంది .ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుంది. ఏ ప్రయత్నం చేసిన విజయం వరిస్తుంది.
వృషభ రాశి
శని బుధుడి ప్రభావంతో వృషభ రాశి జాతకులకు కలిసి వస్తుంది. వృషభ రాశిలో ఈ రెండు గ్రహాలు దశమ స్థానంలో కలుస్తున్నాయి. దీని కారణంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. కెరీర్ పరంగా వృషభ రాశి వారికి బాగుంటుంది.
మిధున రాశి
నిపుణయోగం కారణంగా మిధున రాశి వారికి కలిసి వస్తుంది. మిధునరాశిలో భాగ్యస్థానంలో బుధుడు శని దేవుడితో కలయిక జరుపుతాడు. ఈ సమయం వర్తక వ్యాపారాలు చేసే వారికి విద్యార్థులకు లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
తులారాశి
నిపుణ యోగం కారణంగా తులారాశి జాతకులకు కలిసి వస్తుంది. తులా రాశిలో పంచమ స్థానంలో నిపుణయోగం ఏర్పడుతున్న కారణంగా వీరి ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి.
మకర రాశి
మకర రాశి వారికి నిపుణయోగం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో మకర రాశి వారికి సంపద పెరుగుతుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. సమర్థతకు ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.
కుంభరాశి
కుంభ రాశి వారికి శని, బుధ గ్రహాల కలయిక కారణంగా ఏర్పడే నిపుణ యోగంతో కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఈ సమయంలో మీ సంపద పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications