అక్టోబర్ లో ఈ రాశులవారికి కష్టాల తుఫాన్.. శని, చంద్రుల కలయికతో జాగ్రత్త!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావం చూపిస్తాయి. ఇక గ్రహాలలో ముఖ్య గ్రహం కర్మ ఫలితాలని ఇచ్చే గ్రహం, క్రమశిక్షణ నేర్పే గ్రహం అయిన శని గ్రహం అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావం చూపిస్తుంది. ఇక చంద్రుడిని మనస్సుకు, భావోద్వేగాలకు, తల్లికి కారకుడిగా చెప్తారు. అలాంటి శని, చంద్రుల కలయిక అక్టోబర్ మాసంలో జరుగుతుంది.
మీన రాశిలో శని మరియు చంద్రుల కలయిక
అక్టోబర్ 23, 2026న మీన రాశిలో శని మరియు చంద్రుడు కలుస్తున్నారు. ఈ సంయోగం సుమారు మూడు రోజులపాటు కొనసాగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది కొన్ని రాశుల వారికి కష్టకాలాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో ఆయా రాశులవారి జీవితాలలో సునామీ వస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మేషరాశి
మేష రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక ఒత్తిడి, అనవసర ఖర్చులు పెరగవచ్చు. పనిలో ఆలస్యాలు, మానసిక అశాంతి కనిపించే అవకాశం ఉంది. ఇది మేషరాశి జాతకులకు అన్ని విధాలా అనవసరపు ఇబ్బందులను కలిగిస్తుంది. ఈ సమయంలో మేషరాశి వారు కొత్త పనులు పెండింగ్ పెడితే మంచిది.
సింహరాశి
సింహ రాశి వారికి లక్ష్యాలు చేరుకోవడంలో అడ్డంకులు ఎదురవుతాయి. శని చంద్రుల కలయిక కారణంగా ఆదాయంలో తగ్గుదల, కెరీర్‌లో ఆటంకాలు రావచ్చు. ధనుస్సు రాశి వారికి ఖర్చులు పెరిగి ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు. ఇది సింహ రాశి జాతకులకు నష్టాలను చేకూర్చే కాలం. జాగ్రత్త.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఆరోగ్యంలో అస్థిరత, చిరాకు, ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మీన రాశి వారికి ఈ కాలం మరింత కఠినంగా ఉండవచ్చు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కెరీర్‌లో అడ్డంకులు కనిపించే అవకాశం ఉంది.ఈ మూడు రోజులు పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. అనవసర ఖర్చులు తగ్గించి, ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.
శని ఎఫెక్ట్ తగ్గాలంటే ఇలా చెయ్యండి
ఈ సమయంలో శని ప్రభావాలు తగ్గాలంటే శనివారం నాడు దానం చేయడం, శని మంత్రం జపించడం వంటి చిన్న చర్యలు ఉపశమనం కలిగించవచ్చు. ధైర్యంగా ఉండి, సానుకూలంగా ఆలోచిస్తే ఈ కష్ట కాలం సులభంగా దాటవచ్చు.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.













Click it and Unblock the Notifications
