138 రోజులు ఈ రాశులవారికి చుక్కలు చూపిస్తానంటున్న శని!
జ్యోతిష శాస్త్రంలో శని గ్రహానికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. శని దేవుడు కర్మలకు అధిపతిగా చెబుతారు. శని దేవుడు సహనాన్ని ఇచ్చే దేవుడిగా కూడా చెప్తారు, శని తలుచుకుంటే ధనికుడు నిరుపేద అవుతాడు. నిరుపేద సంపన్నుడు కూడా కాగలడు. చాలా శక్తివంతమైన శని దేవుడు సహనాన్ని కూడా ఇచ్చే దేవుడు. శని చాలా నిదానంగా ప్రయాణం చేస్తాడు.
శని తిరోగమన సంచారం
శని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరాల కాలం పడుతుంది. అటువంటి శనిగ్రహం ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సంవత్సరం మార్చి 29వ తేదీన మీన రాశిలోకి ప్రవేశించిన శని త్వరలో తిరోగమనం చెంది వివిధ రాశుల వారికి ఇబ్బందులను తీసుకురాబోతున్నారు. శని కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారు కష్టాలను ఎదుర్కోబోతున్నారు. మరి ఆ మూడు రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
శని తిరోగమన సంచారం మేషరాశి జాతకులకు కష్టాలను తీసుకువస్తుంది. శని తిరోగమనం కారణంగా మేషరాశి జాతకులు ఆర్థికంగా నష్టపోతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు ముఖ్యంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. జీవితం ఇబ్బందులతో కూడుకుని ఉంటుంది. మేష రాశి వారికి ఒత్తిడి బాగా పెరుగుతుంది.
మిధున రాశి
శని తిరోగమనం కారణంగా మిధున రాశి జాతకులు 138 రోజులపాటు కష్టాలు పడనున్నారు. ఈ సమయంలో వీరికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు కెరీర్లో ఇబ్బందులు వస్తాయి. వారికి కొన్ని నష్టాలు కూడా వస్తాయి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో మిధున రాశి వారు అనారోగ్య సమస్యలతో బాధపడతారు.
సింహరాశి
శని తిరోగమనం కారణంగా సింహరాశి జాతకులు 138 రోజులపాటు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరు కొంత నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఆస్తి నష్టం తో పాటు చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలు మారాలంటే చేసే ప్రయత్నాలు దుష్ఫలితాలను ఇస్తాయి. కెరీర్లో ఇబ్బందులు ఉంటాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications