శని జయంతి నాడు ఈ పనులు చేస్తే ఏల్నాటి శని నుండి విముక్తి!

హిందూ సంప్రదాయంలో శని దేవుడు "కర్మఫలదాత"గా భావిస్తారు. ప్రతి ఏడాది జ్యేష్ఠ అమావాస్య రోజున జరుపుకునే శని జయంతి ఎంతో ప్రత్యేకమైనది. 2026లో ఈ పర్వదినం మే 16, శనివారం రోజున వస్తోంది. ఇదే రోజున అమావాస్య మరియు శనివారం కలవడం వల్ల ఇది అత్యంత శక్తివంతమైన రోజు అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

శనిజయంతి నాడు ఇలా చేస్తే మంచిది

ఈ రోజున శని దేవుని ఆరాధన చేస్తే ఏలినాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని దోషాల నివారణకు పరిహారం లభిస్తుంది. శని దేవుడు న్యాయదేవుడిగా పరిగణించబడతాడు. మనం చేసిన పనులకు అనుగుణంగా ఫలితాలు ఇస్తాడని నమ్మకం. సహజంగా శనిజయంతి నాడు వ్రతం, పూజ, దానం చేయడం ద్వారా కష్టాలు తగ్గి శుభఫలాలు లభిస్తాయని చెబుతారు.

Shani Jayanti 2026 rituals and remedies donations to reduce the effects of elnati shani ashtama shani

ఈ పరిహారాలతో శని దోషాల నుండి విముక్తి

శని జయంతి నాడు కొన్ని పరిహారాలు చేస్తే, శని దేవుడికి ఇష్టమైన పూజలు చేస్తే తగిన ఫలితం ఉంటుంది. శని జయంతి నాడు రావిచెట్టుకు పూజ చేస్తే మంచిది. అంతేకాదు రావి చెట్టు క్రింద నూనె దీపం వెలిగించాలి. 7 లేదా 108 సార్లు ప్రదక్షిణ చేస్తే మంచి జరుగుతుంది. "ఓం శం శనైశ్చరాయ నమః" మంత్రం జపిస్తే కూడా శని దోషాల నుండి విముక్తి లభిస్తుంది.

దానాలతో శని ప్రభావం తగ్గింపు

శని దోషాలను తగ్గించడంలో శని జయంతి నాడు శనివారం సాయంత్రం కొన్ని పరిహారాలు చెయ్యటం మంచిది. నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఆలయంలో లేదా రావి చెట్టు దగ్గర దీపం పెట్టాలి. శని చాలీసా లేదా హనుమాన్ చాలీసా పఠనం చెయ్యాలి. పక్షులకు ఆహారం పెట్టాలి. గేదెలకు, పేదలకు ఆహారం దానం చేయాలి. దానం కూడా శని ప్రభావాన్ని తగ్గించడానికి ముఖ్యమైన మార్గంగా భావిస్తారు.

ఏలినాటి శని, అష్టమ, అర్దాష్టమ శని దోషాలకు పరిహారం ఇదే

శని జయంతి నాడు నల్ల బట్టలు దానం చెయ్యాలి. నల్ల నువ్వులు, నల్ల దుస్తులు, ఇనుము వస్తువులు దానం చేయాలి. ఇవి శని గ్రహాన్ని ప్రసన్నం చేస్తాయని జ్యోతిష్యం చెబుతుంది.
2026లో కొన్ని రాశులపై శని ఏలినాటి శని, అష్టమ, అర్దాష్టమ శని ప్రభావం ఉండే అవకాశం ఉంది. అలాంటి వారు ఈ ఉపాయాలు తప్పనిసరిగా చేస్తే రిజల్ట్స్ బాగుంటుంది. శని దోషాల నుండి ఉపశమనం వస్తుంది.

గమనిక: ఇది ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+