త్వరలో శని త్రయోదశి... ఇలా చేస్తే సంపదలవర్షం కురిపిస్తానన్న శనిదేవుడు!
శని దేవుడు న్యాయ దేవుడు. శని దేవుడు క్రమశిక్షణ నేర్పే దేవుడిగాను, కర్మల ఫలితాలను ఇచ్చే దేవుడిగానూ, సహనాన్ని, ఓర్పును నేర్పే దేవుడిగానూ చెప్తారు. శని దేవుడు జాతకంలో మంచి స్థానంలో ఉంటే మంచి ఫలితాలను, చెడు స్థానంలో ఉంటే చెడు ఫలితాలను ఇస్తాడు. ఆయన కొన్ని సార్లు ఊహించని శుభాలను, కొన్ని సార్లు తట్టుకోలేని బాధలను ఇస్తాడు.
శని త్రయోదశి ఎప్పుడంటే
అటువంటి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది అదే శని త్రయోదశి. ఈ నెలలో డిసెంబర్ 28 వ తేదీన శని త్రయోదశి తెల్లవారుజామున 02:26 గంటలకు ప్రారంభమవుతుంది. త్రయోదశి తిథి మళ్ళీ డిసెంబర్ 29, 2024 ఉదయం 03:32 గంటలకు ముగుస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో శని త్రయోదశి కి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది.

శని దేవుడికి ఇష్టమైన రోజు ప్రత్యేక పూజలు చేస్తే
శని త్రయోదశి శివుడికి ఇష్టమైన రోజు .శనివారం విష్ణువుకు, త్రయోదశి ఆ పరమశివునికి ఇష్టమైన రోజు. కాబట్టి శని త్రయోదశి రోజు శివకేశవులతో పాటు శని భగవానుడిని కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. శని త్రయోదశి నాడు శని భగవానుడిని శాంతింపజేసే పూజలు చేస్తే ఏలినాటి శని, అర్దాష్టమ శనితో బాధ పడే వారికి ఉపశమనం కలుగుతుందని చెప్తారు.
శని త్రయోదశి నాడు ఇలా చెయ్యండి
శని త్రయోదశి జాతకంలో శని ప్రతికూల ప్రభావాలతో బాధ పడే వారికి చాలా విశిష్టమైన రోజు . ఈ రోజు నియమ నిష్ఠలతో శనిపూజ చేస్తే శని దేవుడు సంతోషిస్తాడు. ఫలితంగా వారిపై శని అనుగ్రహాన్ని చూపిస్తాడు. శని త్రయోదశి పండుగ నాడు శనిదేవుని కటాక్షం కోసం ఉదయాన్నే తలస్నానం చేసి.. శని దేవునికి ఇష్టమైన నల్లని రంగు దుస్తులు ధరించి పూజలు చెయ్యాలి.
శని త్రయోదశి నాడు ఇలా చేస్తే శని కటాక్షం
పడమర ముఖంగా కూర్చొని నల్ల నువ్వులతో, నీటితో విఘ్నేశ్వరుడికి, శని దేవుడికి పూజలు చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆపై శని మంత్రాన్ని జపించాలి. పేదలకు నల్లని నువ్వులు, నల్లని వస్త్రాలు లేదా ఇనుప వస్తువులను దానం చేయాలి. ఇలా నిష్ఠతో ఎవరైతే శని దేవుని పూజిస్తారో వారి కష్టాలు తొలగిపోతాయి. కాబట్టి శని భగవానుడి దయ కావాలని భావించేవారు నియమనిష్ఠలతో శనిని పూజించాలి.
శని దేవుడి కటాక్షంతో వారికి సిరి సంపదలు
ఇంట్లో శని దేవుని పూజ సాధ్యం కాకపోతే నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, నల్ల నువ్వులు తీసుకొని నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్లి ఆలయంలో శని దేవుడికి నువ్వుల నూనె, నల్లటి వస్త్రాన్ని సమర్పించి నల్ల నువ్వుల నూనె నైవేద్యంగా పెట్టి ప్రార్థించాలి. ఇలా ఎవరైతే శని త్రయోదశి నాడు శని దేవుని పూజిస్తారో వారికి శని ప్రతికూల ప్రభావాలు పోతాయి. శని దేవుడి కటాక్షంతో వారికి సిరి సంపదలు ప్రాప్తిస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
మేషరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారికి పండుగే!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
కుంభరాశి, మీన రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications