వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Shravana masam 2022: శ్రావణం శుభకరం; శ్రావణ శుక్రవారాల్లో ఈ తప్పులు అస్సలు చెయ్యకండి!!

|
Google Oneindia TeluguNews

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మాసాలలో శ్రావణమాసం ఒకటి. సాధారణంగా జూలై మరియు ఆగస్టు నెలలో వచ్చే ఈ మాసం శివుడికి ఎంతో ప్రత్యేకమైన మాసంగా చెప్పబడుతుంది. శ్రావణ మాసంలో శివుని పూజించడం వల్ల ఆయన కటాక్షం పూర్తిగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక శివుడికే కాదు లక్ష్మీదేవికి కూడా అత్యంత ఇష్టమైన మాసం శ్రావణ మాసం. అందుకే ఈ మాసంలో చాలామంది మహిళలు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. ఇక పెళ్లయిన కొత్త జంటలు ఈ మాసంలో మంగళవారం, శుక్రవారం మంగళ గౌరీ వ్రతం చేస్తుంటారు.ఈ మాసంలో మహిళలు అమ్మవారిని తమ శక్తి కొలది పూజించి తాము నిత్య సుమంగళులుగా ఉండాలని కోరుకుంటారు.

వరాలిచ్చే వరలక్ష్మి పుట్టిన మాసం శ్రావణ మాసం .. అమ్మవారికి పూజకు అందుకే ప్రత్యేక స్థానం

వరాలిచ్చే వరలక్ష్మి పుట్టిన మాసం శ్రావణ మాసం .. అమ్మవారికి పూజకు అందుకే ప్రత్యేక స్థానం

వరాలిచ్చే తల్లి వరలక్ష్మి ఆవిర్భవించిన శ్రావణమాసం ప్రతి ఇంట్లోనూ శుభాలనిచ్చే మాసమని చెప్పాలి. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనవిగా చెబుతారు. ఉదయాన్నే లేచి, వాకిళ్లు శుభ్రం చేసి, గడపలు పూజించి, ఇల్లంతా శుభ్రం చేసుకుని, తలంటు స్నానం చేసి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ మాసంలో అమ్మవారిని పూజిస్తే అనుకున్నవి నెరవేరతాయని, జీవితం సంతోషంగా ఉంటుందని మహిళలు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే ఈ మాసం ప్రతి ఒక్కరి ఇంట్లో మహిళలు చక్కగా రెడీ అయ్యి ఆ వర మహాలక్ష్మిని పూజిస్తారు.

శ్రావణ శుక్రవారాలు అత్యంత శక్తివంతమైన రోజులు ... చెయ్యకూడని పనులు ఎన్నో

శ్రావణ శుక్రవారాలు అత్యంత శక్తివంతమైన రోజులు ... చెయ్యకూడని పనులు ఎన్నో


ఇక శుక్రవారం చాలామందికి అనేక విషయాలకు సెంటిమెంట్ గా ఉంటుంది. శుక్రవారాన్ని అత్యంత శుభప్రదమైన రోజుగా భావిస్తాము. అలాంటిది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు మరింత పవర్ ఉంటుందని విశ్వసిస్తారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుందని చాలామంది విశ్వసిస్తారు. ఇక అటువంటి శుక్రవారం రోజున, అందునా శ్రావణ శుక్రవారం రోజున మనం చేయకూడని అనేక పనులు ఉన్నాయి అని, ఒకవేళ అలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని చెబుతారు. ముఖ్యంగా శ్రావణ మాసంలోని శుక్రవారాల్లో చెయ్యకూడని పనుల వివరాల్లోకి వెళితే

శుక్రవారం నాడు ఈ పనులు అస్సలు చెయ్యకండి

శుక్రవారం నాడు ఈ పనులు అస్సలు చెయ్యకండి


శుక్రవారం నాడు ఎట్టిపరిస్థితులలోనూ ఆలస్యంగా నిద్ర లేవ కూడదు. తెల్లవారుజామునే నిద్ర లేవాలి. అలాగే సాయంత్రం సమయంలో నిద్రపోకూడదు. శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితులలోనూ ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి. విడిచిన బట్టలను మళ్లీమళ్లీ ధరించడం దరిద్రానికి కారణమవుతుంది. అదే విధంగా చిరిగిన బట్టలు ధరించటం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్టు అవుతుంది. శుక్రవారం నాడు ఇంట్లో మహిళలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఏడవకూడదు. అలా ఏడిస్తే ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది.

 శుక్రవారం ఎవరినీ నిందించకండి..

శుక్రవారం ఎవరినీ నిందించకండి..

ఇక ఇళ్ళలో పనిచేయని గడియారాలు, పగిలిపోయిన అద్దాలను ఉంచుకోవడం అనర్థాలకు కారణమౌతుంది. అంతేకాదు శుక్రవారం నాడు ప్రతి ఒక్కరు మనసును అమ్మవారిని ధ్యానం చేయడం పైనే లగ్నం చెయ్యాలి కానీ, శుక్రవారం నాడు ఎవరినీ నిందించటం అసలు శ్రేయస్కరం కాదని చెప్పబడింది. ఇళ్లల్లో మహిళలు ఇంట్లో తమ కుటుంబ సభ్యులను కూడా శుక్రవారం నాడు తిట్టకూడదు. తోడబుట్టిన వారిని ఆదరంగా చూడాలి. వారి మనసును కష్టపెట్టకుండా ఉండాలి.

 శుక్రవారం ఇంటికి ఎవరు వచ్చినా దైవ సమానులే.. ఆతిధ్యం ఇవ్వండి

శుక్రవారం ఇంటికి ఎవరు వచ్చినా దైవ సమానులే.. ఆతిధ్యం ఇవ్వండి


శుక్రవారం నాడు ఇంటికి ఎవరు వచ్చినా వారిని ఒట్టి చేతులతో పంపించ కూడదు అని శాస్త్రం చెబుతోంది. ఇంటికి వచ్చిన వారిని దైవ స్వరూపంగా భావించి వారికి భోజనం పెట్టి, ఫలాలను ఇచ్చి, ఆశీర్వాదం తీసుకుంటే మంచి జరుగుతుందని చెబుతారు. ఇక శుక్రవారం నాడు నోరు లేని మూగ జీవాలను కొట్టరాదు. నోరు లేని మూగ జీవాలకు, నిరుపేదలకు తమ వంతు సహాయం అందిస్తే లక్ష్మీదేవి కృప ఖచ్చితంగా వారిపై ఉంటుందని చెబుతారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
The month of Shravana is said to be the auspicious month of Lord Shiva and Goddess Lakshmi. Elders also told the things that should not be done on Shravana Fridays and things that should be done.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X