Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Shukra Gochar 2024: మకరరాశిలోకి శుక్రుడు.. నేటినుండి వీరికి ధనలక్ష్మీ కటాక్షం!!

శుక్రుడు సంతోషాన్ని, ఆనందాన్ని ప్రసాదించే గ్రహం . విలాసాలకు ప్రాతినిధ్యం వహించే గ్రహం. నేడు మకరరాశిలోకి శుక్ర గ్రహం సంచారం చేయనుంది. మకర రాశిలోకి శుక్రుడు 12 ఫిబ్రవరి 2024న సాయంత్రం 4:41 గంటలకు రావాణా కానున్నాడు . వేద జ్యోతిషశాస్త్రంలో, శుక్ర సంచారం సాధారణంగా శుభ ప్రదంగా పరిగణించబడుతుంది. శుక్ర సంచారం వ్యక్తుల జీవితాలలో ప్రేమ, సంబంధాలు, భాగస్వామ్యం మరియు వివాహాన్ని సూచిస్తుంది.

శుక్ర సంచారం అన్ని రాశుల పైనా ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఈ రవాణా కొన్ని రాశులకు కలిసొస్తుంది. ఆ రాశుల వివరాలు చూస్తే మకర రాశిలో శుక్ర సంచారం వల్ల మేష రాశి వారు గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు. వ్యాపారం చేసే వారికి శుక్ర సంచారం ఆహ్లాదకరంగా మరియు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులు శుక్ర గోచారం వల్ల లాభపడతారు. ప్రయాణ అవకాశాలు కలగవచ్చు.

Shukra Gochar 2024: Venus transit in Capricorn; dhan lakshmi blessings for these zodiac signs

మకర రాశిలో శుక్ర సంచారం వృషభ రాశి జాతకులకు కలిసొస్తుంది. వృషభ రాశి జాతకుల వృత్తిలో కొత్త అవకాశాలు రావచ్చు. శుక్రుని సంచారం వల్ల విదేశాలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మకర రాశిలో శుక్ర సంచార కాలంలో మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే, పురోగతికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కన్యా రాశి వారికి మకర రాశిలో శుక్ర సంచారం లాభాలను చేకూరుస్తుంది. కన్య రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగార్ధులకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం. కొత్త వ్యాపారాలు చేయాలనుకున్నవారు ఈ సమయంలో పెట్టుబడులు పెడితే లాభదాయకం.

తులారాశి వారికి మకరరాశిలో శుక్ర సంచారం కలిసొస్తుంది. తులరాశి వారికి ఈ సమయంలో కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మకరరాశి వారికి మకర రాశిలో శుక్ర సంచారం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది .ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం కోసం ప్రయాణాలు చేసే వారికి ఆ ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

మీన రాశి వారికి శుక్ర సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. మకరరాశిలో శుక్రుడి రవాణా మీన రాశి వారు జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి అవకాశం ఇస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు లాభాలను ఆర్జిస్తారు. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగిస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+