vastu tips: దక్షిణ నైరుతి, దక్షిణ మధ్య వీధిపోట్లు యమా డేంజర్; వాటితో ఏమవుతుందంటే!!

వాస్తు శాస్త్రంలో వీధిపోట్లను గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమైన అంశం. సహజంగా వీధిపోటు అనగానే అదేదో దోషం అన్నట్టు పరిగణిస్తాం. కానీ అన్ని వీధిపోట్లు దోషాలకు కారణం కావు. ఏదైనా ఇల్లు కొనుగోలు చేయాలంటే ఆ ఇంటికి వీధిపోటు ఉంటే కొనుగోలు చేయకుండా వెనక్కిపోతారు. కానీ అన్ని వీధి పోటులు ప్రమాదం కాదనే విషయాన్ని గుర్తించాలి. కొన్ని వీధిపోట్లు మాత్రమే ప్రమాదమని వాస్తు శాస్త్రం చెబుతోంది.

 ఆగ్నేయ, నైరుతీ వీధిపోట్లతో ఇబ్బందులు

ఆగ్నేయ, నైరుతీ వీధిపోట్లతో ఇబ్బందులు


ఆగ్నేయంలో వీధి పోటు ఉంటే అనుకోని కష్టాలు ఎదురవుతాయని, ఎంత కష్టపడినా సంపాదించిన డబ్బు నిలబడదని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పారు. నైరుతిలో వీధిపోటు ఉంటే ఆరోగ్య నష్టాలు కలుగుతాయని, నైరుతి వీధిపోటు ఉంటే ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకు తీవ్రమైన మానసిక ఆందోళన కలుగుతుందని చెబుతున్నారు. అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి అని కూడా చెబుతున్నారు.

దక్షిణ నైరుతీ వీధిపోటుతో ఇల్లాలికి అనారోగ్యం

దక్షిణ నైరుతీ వీధిపోటుతో ఇల్లాలికి అనారోగ్యం


ఇక దక్షిణ నైరుతి వీధి పోటు ఉంటే ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుందని, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దక్షిణ నైరుతి వీధిపోటు వల్ల కుటుంబంలో ఎప్పుడూ సంతోషం ఉండదని, విపరీతమైన ధన వ్యయం అవుతుందని చెబుతున్నారు. ఇంట్లో ఇల్లాలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉంటే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకు ప్రశాంతమైన జీవితం కూడా ఉండదని అంటున్నారు.


Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

దక్షిణ మధ్య వీధిపోటు మరీ డేంజర్

దక్షిణ మధ్య వీధిపోటు మరీ డేంజర్


ఇక దక్షిణ దిశలో మధ్య వీధి పోటు ఉంటే ఇది మరీ డేంజర్ అని చెబుతున్న వాస్తు శాస్త్ర నిపుణులు దక్షిణ మధ్య వీధిపోటు వల్ల మరణాలకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దక్షిణ మధ్య వీధిపోటు వల్ల కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అని, హత్యలకు, ప్రమాదాలకు దక్షిణ మధ్య వీధిపోటు వల్ల అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+