రాహు నక్షత్రంలోకి సూర్యుడి ప్రవేశం.. ఈ రాశులవారిపై కనకవర్షం
ప్రపంచం మొత్తాన్ని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చేది సూర్య భగవానుడు(sun) ఒక్కడే. అందుకే గ్రహాలకు రాజు అని పిలుస్తారు. రవి నెలకోసారి తన రాశిని మారుస్తుంటాడు. అంతేకాదు నక్షత్రాన్ని కూడా మారుస్తాడు. ఈనెల 22వ తేదీన ఆరుద్ర నక్షత్రంలోకి భానుడు ప్రవేశించబోతున్నాడు. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు. ఆరుద్ర లోకి సూర్యుడు ప్రవేశించిన వెంటనే వాతావరణంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి.
వేడి నుంచి ఉపశమనం : ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షం తొమ్మిదో రోజున సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. జూన్ 22వ తేదీ సాయంత్రం 5.48 గంటలకు భానుడు ఈ నక్షత్రంలోకి వెళ్తాడు. రుతుపవనాలకు నాందిగా ఆదిత్యుడి సంచారం ఉంటుంది. భారీ వర్షాలు కురవడంతోపాటు వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరుద్ర నక్షత్రంలోకి భాస్కరుడు ప్రవేశించిన తర్వాత అర్ఘ్యంతోపాటు ఖీర్ సమర్పించాలి. దీనివల్ల మేలు కలుగుతుంది.

మంచి తెలివితేటల కలవారు : మనకు మొత్తం 27 నక్షత్రాలున్నాయి. ఆరుద్ర ఆరోది. పరమేశ్వరుణ్ని, రాహువు ఈ నక్షత్రానికి దేవతలు. ఇందులో పుట్టినవారు మంచి తెలివితేటలు కలిగినవారై ఉంటారు. ఇది మిథునరాశికి సంబంధించినది. త్వరలో ఇదే రాశిలో సూర్యుడు, బుధుడు కలయిక ఉండబోతోంది.
ఎటువంటి ప్రభావమంటే : భానుడి నక్షత్రంలో మార్పు వల్ల మిథునం, కన్య, ధనస్సు, మీనరాశి వారికి భారీగా ధనలాభం ఉంటుంది. వీరు ఉన్నత విద్యను అభ్యసిస్తారు. ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి. కంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో మకర, కుంభరాశి వారు కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.












Click it and Unblock the Notifications