జింక తెలివికి పులి బేజారు -ఒక్క మాటతో కథనే మార్చేసిన సమయస్ఫూర్తి..!!

అనగా అనగా ఒక దట్టమైన అడవి.ఆ అడవిలో ఒక పర్వతం దగ్గర అనేక రకాల జంతువులు నివసించేవి.పిల్లలకు రాత్రివేళల్లో వినడానికి ఎంతో ఆసక్తికరంగా ఉండే కథల్లో 'తెలివైన జింక - పిరికి పులి' కథ ఒకటి.శారీరక బలం కంటే బుద్ధి బలమే గొప్పదని నిరూపించే ఈ కథ,క్లిష్ట సమయంలో సమయస్ఫూర్తి ఎలా కాపాడుతుందో చాలా చక్కగా వివరిస్తుంది.

పులి గుహలో చిక్కుక్కున్న జింక పిల్లలు

ఒకరోజు ఆ అడవిలో ఒక మాతృ జింక తన రెండు చిన్న పిల్లలతో కలిసి హాయిగా గడ్డి మేస్తోంది.ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ జింక పిల్లలు పక్కనే ఉన్న ఒక గుహలోకి వెళ్లాయి.జింక కూడా వాటి వెనుకే లోపలికి వెళ్లింది.అక్కడ ఎముకల కుప్పలు కనిపించడంతో,అది ఒక పులి గుహ అని జింక గ్రహించింది.అదృష్టవశాత్తూ ఆ సమయంలో పులి గుహలో లేదు.అయితే పిల్లలను బయటకు తీసుకువచ్చేలోపే దూరంగా పులి గుహ వైపు రావడం కనిపించింది.

the-clever-deer-and-the-cowardly-tiger-story-a-moral-stories-of-wit-and-presence-of-mind

ఆ సమయంలో గుహ బయటకు వస్తే పులి దాడి చేయడం ఖాయం.దాంతో జింక వెంటనే ఒక తెలివైన ఉపాయం ఆలోచించింది.పులి గుహకు దగ్గరగా రాగానే జింక తన గొంతు పెంచి పెద్దగా అరిచింది. "పిల్లలూ, ఏడవకండి..మన రాత్రి భోజనం కోసం నేను ఒక పులిని వేటాడి తెస్తాను.ఈ రోజు మనకు మంచి విందు దొరుకుతుంది"అని బిగ్గరగా చెప్పింది.ఆ మాటలు విన్న పులి భయంతో వణికిపోయింది.గుహలో ఏదో భయంకరమైన జంతువు ఉందని భావించి అక్కడి నుంచి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరుగెత్తింది.

భూమిపై అత్యంత పెద్ద జీవి.. ఈ అడవి మొత్తం ఒక్కటే చెట్టు!
భూమిపై అత్యంత పెద్ద జీవి.. ఈ అడవి మొత్తం ఒక్కటే చెట్టు!

పరుగెడుతున్న పులిని చూసి ఒక నక్క ఆశ్చర్యపోయింది.విషయం తెలుసుకున్న నక్క, పులి పిరికితనాన్ని గ్రహించి నవ్వింది.గుహలో ఉన్నది ఏదో చిన్న జంతువై ఉంటుందని,భయపడాల్సిన పనిలేదని పులికి ధైర్యం చెప్పింది.కానీ పులి ఒంటరిగా వెళ్ళడానికి భయపడింది.దాంతో నక్క ఒక ఆలోచన చెప్పింది.ఇద్దరి తోకలను ముడి వేసుకుని గుహ వద్దకు వెళ్దామని,దీనివల్ల తను పారిపోలేనని నమ్మబలికింది.పులి సరేననడంతో నక్క రెండింటి తోకలను గట్టిగా ముడివేసి గుహ వైపు నడిచాయి.

సమయస్ఫూర్తి ప్రదర్శించిన జింక

నక్క,పులి కలసి రావడం చూసిన జింక మళ్లీ తన సమయస్ఫూర్తిని ప్రదర్శించింది."పిల్లలూ,మన మిత్రుడు నక్క చాలా మంచివాడు.మన కోసం పులిని బంధించి తోకకు తోక కట్టి మరి తీసుకువస్తున్నాడు.ఇక మనకు రుచికరమైన ఆహారం సిద్ధంగా ఉంది"అని బిగ్గరగా అరిచింది.ఈ మాటలు వినగానే పులికి నక్క తనను మోసం చేసిందని తీవ్రమైన అనుమానం వచ్చింది. భయంతో పులి వెనక్కి తిరిగి పిచ్చిగా పరుగెత్తడం ప్రారంభించింది. ఆ పరుగులో నక్క రాళ్లకు గుద్దుకుని చనిపోగా,పులి తోక తెగిపోయి ప్రాణభయంతో దూరంగా పారిపోయింది.

అడవిని ఏలిన ఫేమస్ పులి మృతి.. 15 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు
అడవిని ఏలిన ఫేమస్ పులి మృతి.. 15 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు

పులి ప్రాణభయంతో అడవిలోని వేరొక ప్రాంతానికి పారిపోవడంతో,జింక తన పిల్లలతో కలిసి సురక్షితంగా ఆ గుహ నుంచి బయటపడింది.ఆ తర్వాత అవి క్షేమంగా తమ మంద వద్దకు చేరుకున్నాయి.ఎంతటి బలమైన శత్రువైనా బుద్ధిబలం,సమయస్ఫూర్తి ముందు ఓడిపోక తప్పదని ఈ సంఘటన నిరూపించింది.

తెలివైన జింక కథ ఇచ్చే నీతి
ఈ కథ మనకు ఇచ్చే ముఖ్యమైన నీతి ఏమిటంటే,ఆపద సమయంలో భయపడకుండా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎలాంటి క్లిష్టమైన సమస్యలకైనా సులభంగా పరిష్కారం లభిస్తుంది.శారీరక బలం కంటే తెలివితేటలు,ఆలోచనా శక్తే మనిషికి లేదా జంతువులకు నిజమైన రక్షణగా నిలుస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+