మరో నాలుగు రోజుల్లో ఈ రాశులపై కనక వర్షం
గ్రహాలు నిర్ణీత సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా చేసే క్రమంలో కొన్ని రాశులవారికి మంచి ప్రయోజనాలు కలిగితే కొన్ని రాశులవారికి ప్రతికూలతలు ఎదురవుతాయి. జ్యోతిష్యం ప్రకారం బుధుడిని బుద్ధికి, వ్యాపారానికి, ధనానికి ప్రతీకగా భావిస్తారు. జనవరి 7వ తేదీన బుధుడి రాశి పరివర్తనం వల్ల 3 రాశులకు ఊహించని విధంగా ప్రయోజనాలు కలగనున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
గ్రహాల రాజకుమారుడిగా భావించే బుధుడి గోచారంతో కొన్ని రాశులవారికి మహర్దశ పట్టనుంది. కుండలిలో బుధుడు శుభ స్థితిలో ఉంటే అంతా సవ్యంగా సాగుతుంది. రెండోతేదీ నుంచి బుధుడు ఈ మార్గంలో ఉన్నాడు. ధనస్సు, మిథున, కన్యా రాశి జాతకులకు మరింతగా కలిసి రానుంది.

ధనస్సు రాశి : వీరికి చాలా బాగుంటుంది. ఊహించనిరీతిలో ధన లాభం ఉంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. కొత్త వ్యాపారం కూడా ప్రారంభిస్తారు. పూర్వీకుల నుంచి సంపద వస్తుంది. దీనివల్ల ఆర్థికంగా పటిష్టమవుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి.
మిథునరాశి : బుధుడి గోచారంతో వీరికి మహర్ధశ పడుతుంది. కొత్త భూమిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అదృష్టం తోడుండటంవల్ల పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. కుటుంబ సభ్యులతో గడపడానికే అధిక సమయాన్ని వెచ్చిస్తారు.
కన్యారాశి : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రియల్ ఎస్టేట్, ఆస్తి, వైద్య రంగాల్లో ఉన్నవారికి లాభాలున్నాయి. కొత్త ఆదాయానికి ద్వారాలు తెరుచుకుంటాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. అదే సమయంలో ఖర్చులు పెరిగే అవకాశముంది కాబట్టి వాటిని నియంత్రించుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications