తులారాశిలో సూర్యుడు, బుధుడు... ఈ రాశులవారిపై కనకవర్షం

ప్రతి గ్రహం నిర్ధిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంటుంది. ఇలా మార్చే క్రమంలో కొన్ని శుభ యోగాలతోపాటు అశుభ యోగాలను కూడా ఏర్పరుస్తుంది. గ్రహాలకు రాజైన సూర్యభగవానుడు ఈనెల 17వ తేదీన తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. మరో రెండు రోజుల తర్వాత గ్రహాల యువరాజు బుధుడు తన సొంత రాశి అయిన తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశిలో సూర్యుడు, బుధుడి కలయికవల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగంవల్ల మూడు రాశులవారికి కలిసిరానుంది. ఏయే రాశులనే వివరాలు తెలుసుకుందాం.

కన్యా రాశి
బుధాదిత్య రాజయోగం కన్యారాశివారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అదే సమయంలో ఆదాయం రెట్టింపవుతుంది. తద్వారా ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడుతుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందడంతోపాటు భారీ ఆర్డర్లను చేజిక్కించుకుంటారు. ఉద్యోగులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

these zodiac sign people are very lucky due to Budhaditya Yog in Libra 2023

మకరరాశి
ఈ రాశివారికి బుధాదిత్య రాజయోగం ఎంతో శుభప్రదం. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి ఊహించనిరీతిలో మద్దతు లభిస్తుంది. జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభించడంతోపాటు చేపట్టే ప్రతి పనిలోను విజయం సాధిస్తారు.

ధనుస్సు రాశి
బుధాదిత్య రాజయోగం ధనుస్సు రాశివారికి ఎంతో అద్భుతంగా ఉండనుంది. ఆదాయం పెరగడంతోపాటు డబ్బును పొదుపు చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు. వ్యాపారస్తులకు లాభాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+