సెప్టెంబరు 16వ తేదీ నుంచి మొత్తం పరిస్థితి మారిపోతుంది
జ్యోతిష్యంలో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ప్రధానంగా సూర్యుడిని గ్రహాలకు రారాజుగా పరిగణిస్తారు. శనిని న్యాయదేవతగా, బుధుడిని యువరాజుగా గరుడిని గురు గ్రహంగా భావిస్తారు. గ్రహాల రాజకుమారుడైన బుధుడు బుద్ధి, తర్కం, వాదన, వ్యాపారానికి ప్రతీక. బుధుడి ప్రతి కదలిక ఈ అంశాలపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. సూర్యుడి రాశిగా భావించే సింహరాశిలో బుధుడి సక్రమ మార్గంవల్ల ప్రధానంగా మూడు రాశులకు లాభం కలగనుంది. ఏయే రాశులవారనే వివరాలు తెలుసుకుందాం.
సింహ రాశి: 16వ తేదీ నుంచి పరిస్థితి మొత్తం మారిపోతుంది. వీరికి అనేక లాబాలున్నాయి. చేపట్టిన పనులు వెంటనే పూర్తవుతాయి. ఆలోచనల్లో ఉన్నవి కార్యరూపం దాలుస్తాయి. ఆదాయం పెరగడంతోపాటు ఆకస్మిక ధనలాభం వల్ల ఆర్థికంగా బలోపేతమైన స్థితిలో ఉంటారు. గతంలో మొదలై ఆగిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. అదృష్టం వీరికి తోడుగా ఉంటుంది.

ధనుస్సు రాశి: ఆదాయం పెరగనుంది. ఆర్థికంగా ఎటువంటి కష్టాలు ఉండవు. వ్యాపారస్తులకు ఊహించని లాభం ఉంది. కష్టార్జితంతోపాటు సమాజంలో మీకుండే పరిచయాల ఆధారంగా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వివాహ జీవితం బాగుంటుంది. దీనివల్ల కూడా ధనలాభం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు.
మేష రాశి: జీవిత భాగస్వామితో బంధం బలోపేతమవుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. అదే సమయంలో పొదుపు కూడా చేస్తారు. వ్యాపారస్తులకు భారీ ఆర్డర్లు రావడంవల్ల లాభాల్లో ఉంటారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తో పదోన్నతి ఉంటుంది.












Click it and Unblock the Notifications