ఈ నాలుగు రాశులవారిపై శనిదేవుడి చల్లనిచూపు
మరికొన్ని రోజుల్లో 2023 సంవత్సరానికి వీడ్కోలు పలకనున్నాం. ఈ సమయంలో జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలికలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొత్త ఏడాదిలో శని దేవుడు కుంభరాశిలోనే సంచారం చేయనున్నాడు. మనం చేసిన కర్మలను బట్టి శని ఫలితాలను ఇస్తాడు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో శని సాడే సతి సంభవిస్తుంది. ఆ సమయంలో శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఒక్కో రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాలు శని ఉంటాడు. కొత్త ఏడాదిలో కుంభరాశిలోనే ఉంటాడు. శని దేవుడి దయ ఉండే రాశుల వివరాలు తెలుసుకుందాం.
వృషభ రాశి
ఈ రాశికి చెందిన శుక్రుడితో శనికి స్నేహ పూర్వక సంబంధాలుంటాయి. వృషభ రాశి వారికి శని సాడే సతి ప్రభావం తక్కువగా ఉంటుంది. శని శుభ స్థానంలో ఉండటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.

తులా రాశి
ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు. శనిదేవుడి అనుగ్రహంతో కొత్త ఏడాదిలో విజయాలు సాధిస్తారు. వీరికి మంచి లాభాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
మకర రాశి
శని సాడే సతి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఇది శనిదేవుడి సొంత రాశి కావడంతో వీరికి ఇబ్బందులు కూడా తక్కువగా ఎదురవుతాయి. జీవితంలో మంచి స్థానానికి చేరుకుంటారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వృత్తిలోని వారికి కలిసివస్తుంది.
కుంభ రాశి
ఈ రాశివారికి శనిదేవుడే అధిపతి కావడంతో ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. కుంభంలో మూల త్రికోణ స్థానంలో శని ఉన్నాడు. ఈ కారణంగా శని స్థానం బలంగా ఉంటుంది. కొత్త సంవత్సరం మొత్తం ఈ రాశివారికి శనిదేవుడి విశేష ఆశీస్సులు లభిస్తాయి.












Click it and Unblock the Notifications