బుధుడి రాశిలో శుక్రుడు... రెండురెట్లు పెరగనున్న సంపద
వేద జ్యోతిష్యం ప్రకారం ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడానికి శుక్రుడికి నెలరోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తున్న శుక్రుడు నవంబరు మొదటివారంలో కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రభావం అన్ని రాశులవారిపై ఉన్నప్పటికీ శుక్రుడి అనుగ్రహాన్ని ప్రత్యేకంగా మూడు రాశులవారు పొందనున్నారు. దీనివల్ల ధనలాభంతోపాటు శుభాలు జరుగుతాయి. ఏయే రాశులనేది తెలుసుకుందాం.
కన్యారాశి : వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. డబ్బుతోపాటు ఇతర ఆర్థిక పరమైన విషయాలన్నీ మెరుగు పడతాయి. ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. శుక్రుడు సంపదకు, అదృష్టానికి అధిపతి. దీనివల్ల అదృష్టం మీవైపు ఉంటుంది. ఊహించని ధనాన్ని పొందుతారు. చేసేపనిలో విజయం లభిస్తుంది. కోరికలన్నీ నెరవేరతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.

వృషభ రాశి : శుక్రుడు ఈ రాశి నుంచి 5వ ఇంట్లో ప్రయాణించబోతున్నాడు. దీనివల్ల పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. స్టాక్ మార్కెట్ కు సంబంధించిన విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ప్రేమ సంబంధాలు శుభకరంగా ముగుస్తాయి. ప్రేమ పెళ్లిగా మారుతుంది. శుక్రుడు వృషభరాశి నుంచి ఆరో ఇంటికి అధిపతి. దీనివల్ల కోర్టు కేసుల్లో విజయం దక్కుతుంది.
మిథున రాశి : శుక్రుడి సంచారం ఈ రాశివారికి కలిసివస్తుంది. శుక్రుడు ఈ జాతకంలోని నాలుగో ఇంట్లో సంచరించబోతున్నాడు. దీనివల్ల భౌతిక ఆనందాలు సొంతమవుతాయి. వృత్తి జీవితంలో జరుగుతున్న మార్పులన్నీ మీకు అనుకూలంగా మారతాయి. కుటుంబ సభ్యులతో గతంలోకంటే ఇప్పుడు సంబంధాలు బలోపేతమవుతాయి. పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు కలుగుతాయి. తల్లితో అనుబంధం బలంగా ఉండటంతో పాటు ఆమె నుంచి సంపద పొందుతారు.












Click it and Unblock the Notifications