జూన్ 16 నుంచి ఈ రాశుల దశ తిరగబోతోంది
జ్యోతిష్యంలో గ్రహాల గోచారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని రాశుల జీవితాలపై ఇవి ప్రభావం చూపిస్తుంటాయి. సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశించడంతో సింహరాశి, మకర రాశి, మిథున రాశి, మేష రాశి వారికి ఏవిధంగా కలిసి వస్తుందో తెలుసుకుందాం.
గ్రహాలకు రాజు అయిన సూర్యుడు ఈనెల 15వ తేదీన వృషభ రాశి నుంచి మిధున రాశిలోకి ప్రవేశించనున్నాడు. 16వ తేదీన గోచారం ఉంటుంది. ఈ రాశి పరివర్తనంవల్ల కొన్ని జాతకాలకు కలిసిరానుంది. సూర్యుడు ప్రవేశిస్తున్న మిథునం బుధుడి రాశి. బుధుడు బుద్ధిని ప్రసాదిస్తాడు. సూర్యుడి రాశి పరివర్తనం కొన్ని రాశులపై సానుకూలంగా ఉంటుంది. రాశులవారికి ఎలా కలిసిరానుందో తెలుసుకుందాం.

మకర రాశి : వీరికి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. వీరు చేపట్టే పనులన్నీ విజయవంతమవుతాయి. ఉద్యోగస్తులక ప్రమోషన్ ఉంటంది. అప్పుల నుంచి బయటపడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు కలుగుతాయి.
మేష రాశి : ఈ రాశివారికి అద్భుతంగా ఉంటుంది. కొత్త సమస్యలు ఎదురైనప్పటికీ సామర్థ్యంతో బయటపడేస్తారు. పనిచేసే ప్రాంతంలో అక్కడి సిబ్బంది సహకారం లభిస్తుంది. ఆర్థికంగా లాభపడతారు.
సింహ రాశి : సూర్యుడి రాశి పరివర్తనం కారణంగా సింహ రాశి జాతకులకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 16వ తేదీ నుంచి వీరికి అంతా అనుకూలంగా ఉంటుంది. విద్యార్ధులకు మంచి సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కచ్చితంగా ఆర్థిక లాభం ఉంటుంది.
మిధున రాశి : సూర్యుడి గోచారం కారణంగా మిధున రాశి జాతకులు మంచి ఫలితాలను పొందబోతున్నారు. యాత్రలు చేస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. భారీ సంఖ్యలో లాభాలుంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉండటమే కాక ఉద్యోగస్తులకు ప్రమోషన్ తోపాటు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.












Click it and Unblock the Notifications