మహా శివరాత్రి నుంచి ఈ రాశులకు ధనయోగం
ఈ నెల 8వ తేదీన శుక్రుడు కుంభ రాశిలోకి, బుధుడు మీన రాశిలోకి మారుతున్నారు. దీనివల్ల ఆరు రాశులకు ధన యోగం, రాజయోగం వంటి శుభ యోగాలు కలుగుతున్నాయి. ప్రధానంగా ఆరు రాశులవారికి మాత్రం బాగా కలిసివస్తుంది. ఇతర రాశులకు మాత్రం మిశ్రమ ఫలితాలే ఎదురవుతాయి. ఈనెల 31వ తేదీ వరకు ఒకరకంగా ఈ ఆరు రాశులవారు మహారాజులని చెప్పవచ్చు. వారికి ఏ విధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం.
మేషరాశి
ఆర్థికంగా చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహన, గృహ ప్రయత్నాలన్నీ సానుకూలమవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం చోటుచేసుకుంటుంది. రావల్సిన బకాయిలు రావడంవల్ల సంపద పెరగడంతోపాటు బుధుడు ఈ రాశివారికి వ్యయస్థానంలో రాజయోగాన్ని కల్పిస్తాడు.

వృషభ రాశి
వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి రాజయోగం ఉంది. ఉద్యోగస్తులకు మంచి కంపెనీల్లో అవకాశం లభించనుంది. జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి ఉంటాయి. మనసులోని కోరికలు నెరవేరతాయి.
మిథునరాశి
వృత్తి, ఉద్యోగాలతోపాటు వ్యాపారంలో కూడా ప్రాభవం పెరుగుతుంది. విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతారు. జీతభత్యాలతోపాటు రాబడి, ఇతర ఆదాయాలు, ఆస్తులవల్ల సంపద పెరుగుతుంది.
తులారాశి
ఉన్నతస్థాయి వ్యక్తులు, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఏ రంగంలో ఉన్నవారికైనా ఆర్థికంగా లాభాలుంటాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి.
మకర రాశి
జీతభత్యాలు భారీగా పెరుగుతాయి. రాజయోగాన్ని అనుభవిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిణామాలు జరుగుతాయి. తండ్రి వైపు నుంచి సంపద పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు, జీవిత భాగస్వామికి అదృష్టం పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభరాశి
అపార ధనలాభం ఉంది. వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో కలిసి తిరుగుతారు. పరిచయాలన్నీ లాభదాయకంగా ఉంటాయి. ఆస్తికి సంబంధించిన ఒప్పందాలు జరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.












Click it and Unblock the Notifications