31వ తేదీ నుంచి ఈ రాశులకు అఖండ రాజయోగం
జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కలయికలు, రాశుల సంచారంలాంటివాటివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసివస్తుంది. మరికొన్ని రాశులవారికి మాత్రం ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. ఒక నిర్దిష్ట సమయంలోనే గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఈనెల 31న సాయంత్రం 4:45 గంటలకు శుక్రుడు తన రాశిని మార్చనున్నాడు. ప్రస్తుతం ఉన్న కుంభరాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో శుక్రుడు.. సూర్యుడు, రాహువుతో కలవనున్నాడు. శుక్ర గ్రహం మీనరాశిలో ఉచ్ఛస్థితిలో ఉండటంవల్ల మాళవ్య రాజయోగం ఏర్పడనుంది. ఇది అఖండ రాజయోగం. దీనివల్ల ఏయే రాశులవారికి అదృష్టం కలిసిరానుందో తెలుసుకుందాం.
మేష రాశి
మాళవ్య రాజయోగంవల్ల ఈ రాశివారికి అఖండ రాజయోగం ఏర్పడనుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నింటినీ ఈ సమయంలో పూర్తిచేస్తారు. విద్యార్థులకు బాగా కలిసివస్తుంది. వైవాహిక జీవితంలో అనుబంధం బలపడుతున్నప్పటికీ చిన్న చిన్న మనస్పర్థలవల్ల సున్నితమైన విభేదాలు ఏర్పడతాయి. ఎవరో ఒకరు తగ్గడంవల్ల వివాదాలు తలెత్తవు.

సింహ రాశి
ఈ రాశివారికి ఆర్థికంగా కలిసివస్తుంది. అనుకున్న పనులు పూర్తిచేయగలుగుతారు. వ్యాపారస్తులకు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో లేదంటే సన్నిహితులతో కలిసి ఆధ్యాత్మికపరమైన యాత్రలు లేదంటే విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగం చేసేచోట పై అధికారుల నుంచి ప్రశంసలతోపాటు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది.
మీన రాశి
కెరీర్ కు సంబంధించి శుభవార్తలు వింటారు. అనుకున్న పనులను సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికంగా గతంకంటే బలపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆసక్తి కలుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ పూర్తి ఆరోగ్యంగానే ఉంటారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను సాధ్యమైనంతవరకు పూర్తిచేయగలుగుతారు. కొన్ని పనులకు మాత్రం సన్నిహితుల నుంచి సహకారం తీసుకొని పూర్తిచేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications