మే నెలలో ఈ రాశులవారికి ఎదురే లేదు

జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించి మే అనేది చాలా ప్రత్యేకమైన నెల. ఈ నెలలోనే అంగారకుడు, శుక్రుడు, సూర్యుడి రాశిచక్రంలో మార్పు ఉంటుంది. గ్రహాల మార్పు అనేది శుభ, అశుభ ఫలితాలను అందిస్తుంది. మే 15న వృషభ రాశిలో సూర్యుడి సంచారం జరగనుంది. ఆ రోజు నుంచి సూర్యుడి వృషభ సంక్రాంతి ఉంటుంది. శుక్రుడి అనుగ్రహం ఉంటే దేనికీ లోటుండదు. మీ జాతకంలో శుక్రుడు బలమైన స్థానంలో ఉంటే ప్రేమ, రొమాన్స్, లగ్జరీ లైఫ్, డబ్బు మొదలైనవాటికి కొదవ ఉండదు.

శుక్రుడు మే 2వ తేదీన మిథునరాశిలోకి ప్రవేశించి 30వ తేదీ వరకు ఉంటాడు. మే 10న కర్కాటక రాశిలో అంగారక సంచారం జరగనుంది. 2023 మే నెలలో జరగబోయే ఈ మార్పులు మొత్తం 12 రాశులనూ ప్రభావితం చేస్తాయి. ఇందులో 5 రాశులవారు ఎక్కువగా ప్రయోజనం పొందుతారు. వారెవరెవరో తెలుసుకుందాం.

 horoscope

మిథునరాశి : ఈ రాశివారికి ఎక్కువ లాభం చేకూరనుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. గతంలో వేర్వేరుచోట్ల నిలిచిపోయిన మీ డబ్బును తిరిగి పొందుతారు. అలాగే పూర్వీకుల ఆస్తిని కూడా పొందడానికి అవకాశం ఉంది. రచన, జర్నలిజం, విద్యారంగంలో ఉన్న వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాలు పొందడమే కాక వీరి ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి.

సింహరాశి : ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఈ నెలలో ఆర్థిక సంక్షోభం తొలగడంతోపాటు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా మారుతుంది. కొత్త ఉద్యోగం పొందడంతోపాటు సమాజంలో స్థానం, కీర్తి పెరుగుతాయి. చేసే ప్రతి పనిలో అదృష్టం కలిసివస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపార నిమిత్తం దూర ప్రయాణం చేయాల్సి రావచ్చు.

వృశ్చిక రాశి : ఆర్థికంగా ఈ నెల కలిసివస్తుంది. వ్యాపారవేత్తలు కొత్త పెట్టుబడి లేదంటే భాగస్వామ్య అవకాశాన్ని పొందుతారు. కృషికి ప్రశంసలు దక్కుతాయి. లాటరీ లేదంటే పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. వ్యాపారం విస్తరించడంద్వారా ధనలాభం ఉంటుంది.

మకర రాశి : ఈ రాశివారికి మేలు జరగనుంది. బ్యాంకు బ్యాలెన్స్ లో పెరుగుదల ఉండటంతోపాటు గతానికంటే ఎక్కువగా ఆదా చేసుకుంటారు. కార్యాలయంలో పనికి తగిన గుర్తింపు లభించడంతోపాటు ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారం చేసేవారికి చేసే ప్రతి పనిలోను కలిసివస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+