4 శుభయోగాలు... అంతులేని ధన సంపద ఈ రాశుల సొంతం
బృహస్పతి ప్రస్తుతం వృషభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈనెల 14వ తేదీన సూర్యుడు కూడా ఇదే రాశిలోకి ప్రవేశించనున్నాడు. అలాగే 19వ తేదీన శుక్రుడు కూడా వస్తాడు. చివరగా 31వ తేదీన బుధుడు కూడా ఇదే రాశిలో సంచారం చేస్తాడు. ఒకే రాశిలో నాలుగు గ్రహాల కలయికవల్ల చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. దీంతోపాటు ఈ రాశిలో మరో మూడు శుభయోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. గురుడు, శుక్రుడు కలిసి గజలక్ష్మి యోగం.. సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య యోగం.. సూర్యుడు, శుక్రుడు కలిసి శుక్రాదిత్య యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఒకే రాశిలో ఇన్ని శుభయోగాలు కలవడం చాలా అరుదు. వీటివల్ల ప్రధానంగా ఏయే రాశులకు, ఏవిధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం.
వృషభ రాశి
శుభయోగంలో ఉన్న నాలుగు గ్రహాలు ఈరాశివారికి అనుకూల ఫలితాలనిస్తాయి. ఆర్థికంగా బలోపేతమవుతారు. వ్యాపారస్తులకు డబ్బు సంపాదనకు అవకాశం ఏర్పడుతుంది. జీవితంలో ఆనందాన్ని చవిచూస్తారు. ఆస్తి, వాహనం కొనుగోలు ఉంది. ఉద్యోగస్తులకు బాగుంది. కెరీర్ లో పురోగతి కోసం ఏ ప్రయత్నాలైతే చేస్తారో అవి సత్ఫలితాలనే ఇస్తాయి.

కన్యా రాశి
విద్యార్థులకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి విజయాలున్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరిక తీరే సమయం ఇది. చతుర్గ్రాహి యోగం వల్ల సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది.
వృశ్చిక రాశి
కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధ బలోపేతమవుతుంది. పూర్వీకుల నుంచి ఆస్తి లభిస్తుంది. అత్త మామల నుంచి ఆర్థిక సహాయాన్ని అందుకుంటారు. ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడటంతోపాటు కుటుంబ సభ్యులు లేదంటే సన్నిహితులతో కలిసి తీర్థయాత్రకు లేదంటే విహారయాత్రకు వెళతారు.
మకర రాశి
ఈ రాశి తొమ్మిదో ఇంట్లో గురు గ్రహం దృష్టి ఉంది. జ్యోతిష్యం ప్రకారం తొమ్మిదో ఇంటిని పవిత్రమైనదిగా భావిస్తారు. దీనివల్ల ఉద్యోగులకు వేతనం పెరగడంతోపాటు పదోన్నతి కూడా లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. మతపరమైన ప్రదేశాన్ని సందర్శిస్తారు. శుభయోగం ప్రభావంతో అవివాహితులకు పెళ్లి సంబంధాలు వస్తాయి.












Click it and Unblock the Notifications