మీన రాశిలో కుజుడు.. ఈ రాశులకు రాజయోగం
ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న కుజుడు ఈ నెలాఖరు వరకు ఉంటాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఓవైపు రాజయోగం కలిగిస్తూనే మరోవైపు ఇబ్బందులు కలిగిస్తుంది.
ఆదాయం పెరగకుండా ఖర్చులు పెరగడం, ప్రమోషన్ ద్వారా ఒత్తిడి పెరగడం, మిత్రుల్లో కొందరు శత్రువులుగా మారడం, చిన్న ఉద్యోగాన్ని కూడా ఎక్కడో దూర ప్రాంతంలో ఇవ్వడం లాంటివి జరుగుతాయి. ఏయే రాశులవారికి ఏవిధంగా జరుగుతుందో తెలుసుకుందాం.ప్రస్తుతం తన మిత్ర క్షేత్రమైన మీన రాశిలో సంచారం చేస్తున్న కుజుడు ఈ నెలాఖరు వరకు అదే రాశిలో ఉండడం జరుగుతుంది. కుజుడి ఈ మీన రాశి సంచారం

మేషం
వ్యయ స్థానంలో కుజుడు సంచరిస్తుండటంవల్ల విపరీత రాజయోగం ఏర్పడుతోంది. వృత్తి, వ్యాపారాలు బాగుంటాయి. గృహ, వాహన సౌకర్యాలు కలుగుతాయి. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటారు. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆస్తులు కొనుగోలు చేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. చిన్న ఉద్యోగానికి కూడా దూర ప్రాంతం వెళ్లాల్సి ఉంటుంది.
సింహం
సంపన్న వ్యక్తితో వివాహం కుదురుతుంది. జీవిత భాగస్వామికి ఆకస్మిక ధనలాభం ఉంది. పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారం చెలాయిస్తారు. వాహనాలు, అగ్ని, విద్యుత్తు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రయాణంలో విలువైనవి కోల్పోతారు. మిత్రుల వల్ల కచ్చితంగా నమ్మక ద్రోహం జరుగుతుంది.
కన్య
విదేశీ ప్రయాణానికి సంబంధించిన ప్రయత్నాలు సఫలమవుతాయి. కొత్త వ్యాపారాలు బాగుంటాయి. ఆదాయం బాగుంటుంది. దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తుతాయి. కుటుంబంలో ఘర్షణ జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ధనుస్సు
ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత అన్నట్లుగా పరిస్థితి తయారవుతుంది. ఉద్యోగంలో అధికార యోగం ఉంది. పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ జీవితంలో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాంపత్య జీవితం కూడా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధికార యోగానికి అవకాశం ఉంది.
కుంభం
ఆదాయ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. పెళ్లికి సంబంధించిన ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. డబ్బు వృథా అవుతుంటుంది. బంధుమిత్రులతో అపోహలు, అపార్థాలు కలుగుతాయి. మోసానికి గురవుతారు.
మీనం
నిరుద్యోగులతోపాటు ఉద్యోగం చేస్తున్నవారికి కూడా విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆస్తిపాస్తులు కలిసివస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆస్తికి సంబంధించిన వివాదాలు సానుకూలంగానే పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామితో తీవ్ర గొడవ జరుగుతుంది. కష్టార్జితం అంతా దుర్వినియోగం అవుతుంది. వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన వివాదాలు చోటుచేసుకుంటాయి.












Click it and Unblock the Notifications