బుధుడి సంచారంతో ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే

బుధుడు మేషరాశిలోకి ప్రవేశించడంవల్ల కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు దక్కనున్నాయి. మే 31 వరకు ఈ రాశిలోనే ఉండి తర్వాత తన రాశిని మార్చుకుంటాడు. వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. తెలివితేటలకు, స్నేహానికి, కమ్యూనికేషన్స్ కు ప్రధాన కారకుడైన బుధుడివల్ల శుభ ఫలితాలు కలగనున్నాయి. కొన్ని రాశులవారికి మంచిరోజులు ప్రారంభమయ్యాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.

మిథనరాశి
వీరికి అదృష్టం తోడుంటుంది. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. కెరీర్ బాగుంటుంది. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

these zodiac signs very lucky due to mercury transit into aries

కర్కాటక రాశి
తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉంది. వెంటనే దాన్ని మానుకోవాలి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయం తీసుకోరాదు. వాహనం కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరడంతోపాటు ప్రేమకు సంబంధినంచిన విషయంలో కాస్తంత ఓర్పు అవసరమవుతుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. బుధుడి సంచారంతో స్థానం, ప్రతిష్ట పెరుగుతుంది.

సింహ రాశి
ఉద్యోగస్తులకు పెద్ద పదవి ప్రమోషన్ రూపంలో వస్తుంది. శత్రువును జయిస్తారు. అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.

తులా రాశి
కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి ఉంది. అలాగే కొత్త ఉద్యోగాన్ని కూడా పొందుతారు. ఆధ్యాత్మిక విషయాపట్ల ఆసక్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతోకానీ, స్నేహితులతోకానీ కలిసి ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి
కొత్తగా వివాహమైన జంటకు సంతాన యోగం ఉంది. పెళ్లి కానివారికి సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నించేవారి కోరిక నెరవేరుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో కచ్చితమైన విజయాన్ని సాధిస్తారు.

కుంభ రాశి
వీరికి శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులకు ప్రమోషన్స్ వస్తాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించడంవల్ల ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులకు భారీ లాభాలున్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఈనెల 10 నుంచి 31వ తేదీ వరకు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+