ఒకేరాశిలో కలుస్తూ వారందరికీ డబ్బు మూటలు ఎత్తుకొస్తున్న 3 గ్రహాలు
శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ నెల 31న సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. వచ్చేనెల 16వ తేదీన సూర్యుడు కూడా ఇదే రాశిలోకి వస్తాడు. ప్రస్తుతం సింహరాశిలో బుధుడు కూడా ఉన్నాడు. సూర్యుడు, శుక్రుడు, బుధుడి కలయికవల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. దీనివల్ల ఏ రాశులవారికి కలిసిరానుందో, ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
వృశ్చికరాశివారికి త్రిగ్రాహి యోగంవల్ల అనేక లాభాలు కలుగుతున్నాయి. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. ఆర్థికంగా గతంకంటే ఎక్కువగా బలపడతారు. ఖర్చులపై నియంత్రణ లేకపోతే తీవ్రంగా ఇబ్బంది పడతారు. వ్యక్తిగత జీవితంతోపాటు ప్రేమ జీవితం కూడా శృంగార భరితంగా ఉండబోతోంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించడంతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు.

ధనుస్సు రాశి
ఈ రాశివారు ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇది మంచి సమయం. ఈ నెలలో ఏ పని తలపెట్టిన అద్భుత విజయం దక్కుతుంది. కెరీర్ పరంగా కొత్త కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. గతంలో రావాల్సి నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి.
సింహరాశి
ఏ పని తలపెట్టినా సానుకూలంగా పూర్తవుతుంది. ప్రతి పనిలో విజయం సాధించడంతోపాటు ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మత ప్రచారాల్లో పాల్గొంటారు. అవివాహితులు వివాహ బంధంలో అడుగుపెడతారు. పెద్దల ఆరోగ్యంపై దృష్టిసారించాలి. ఖర్చులను నియంత్రించుకొని పొదుపు చేసిన డబ్బులతో వారికి మంచి ఆరోగ్యాన్ని కల్పించాలి.












Click it and Unblock the Notifications