మార్చిలో తొలి సూర్యగ్రహణంతో ఈ రాశులవారే మహర్జాతకులు!

ఈ సంవత్సరం మార్చి 29వ తేదీన 2025 సంవత్సరంలో తొలి పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించనప్పటికీ, అదేరోజు మీనరాశిలో సూర్యుడు, చంద్రుడు, రాహువులు కలవడం కారణంగా జాతకపరంగా మాత్రం గ్రహణ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. ఈ సూర్యగ్రహణం కారణంగా కొన్ని రాశులవారికి శుభఫలితాలు రానున్నాయి. మార్చి 29వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం కారణంగా లబ్ధిని పొందుతున్న రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభరాశి
వృషభ రాశిలో లాభ స్థానంలో సూర్యగ్రహణం సంభవిస్తున్న కారణంగా ఈ రాశివారికి మంచి ఫలితాలు వస్తాయి. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వృద్ధి వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. తల్లిదండ్రుల నుంచి ఆస్తిలాభం వస్తుంది.

These zodiac signs will be the lucky ones with the first solar eclipse of this year

మిధున రాశి
మిధున రాశిలో దశమ స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడుతున్న కారణంగా మిధున రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో ఆకస్మిక పరిణామాలు సంతోషాన్ని కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు చేసే వారికి లాభదాయకం. ఈ సమయంలో మిధున రాశి వారికి అనేకమార్గాలలో ఆదాయం వస్తుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశికి భాగ్యస్థానంలో సూర్యగ్రహణం ఏర్పడుతున్న కారణంగా కర్కాటక రాశి జాతకులు ఏ పని చేసిన విజయాలు వరిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్యలకు వెళ్లే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి వారసత్వ ఆస్తి వస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

తులారాశి
తులారాశిలో ఆరవ స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడుతున్న కారణంగా తులా రాశి జాతకులు శుభ ఫలితాలు పొందుతారు. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కలలో కూడా ఊహించని విధంగా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో పని భారం తగ్గుతుంది. వృత్తి వ్యాపారాలలో రాబడి ఆశించిన స్థాయిలో ఉంటుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో పంచమ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్న కారణంగా వృశ్చిక రాశి వారి జీవితం బాగుంటుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సానుకూల ఫలితాలు వస్తాయి. పిల్లలు ఈ సమయంలో ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు.

మకర రాశి
మకర రాశిలో తృతీయ స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడుతున్న కారణంగా మకర రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది . ఈ సమయంలో వీరే పని చేసిన కలిసి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు వస్తాయి. విదేశీ ప్రయాణాలకు అవకాశాలు కలుగుతాయి. ఆర్థిక నష్టాలు కష్టాల నుంచి చాలా వరకు బయటపడతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+