24వ తేదీ నుంచి 10 రోజుల్లో ఈ రాశుల తలరాత మారిపోతుంది

గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు, సంపదకు కారకుడయ్యే శుక్రుడు ప్రస్తుతం నీచస్థితిలో ఉన్నారు. సూర్యుడు తులారాశిలో నవంబరు 17వ తేదీ వరకు నీచ స్థితిలోనే ఉంటాడు. అలాగే శుక్రుడు ఈ నెల 24వ తేదీ నుంచి నీచస్థితి కలిగింది. నవంబరు 2వ తేదీ వరకు ఇదే స్థితిలో ఉంటాడు. ఇవి నీచ స్థితిలో ఉన్నప్పటికీ కొన్ని రాశులకు మాత్రం అన్నీ శుభ ఫలితాలే కలుగుతున్నాయి. ఈ ప్రభావం 10 రోజులపాటు ఉంటుంది. ఏయే రాశులకు కలిసివస్తుందనే వివరాలను తెలుసుకుందాం.

కన్యారాశి
ఆదాయం పెరగడంతోపాటు ఖర్చులు తగ్గుతాయి. ఆర్థికంగా ఉన్న సమస్యలు, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఇక రాదు అనుకున్న సొమ్ము చేతికి అందుతుంది. పొదుపు చేసిన చోట నుంచి మంచి లాభాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది.

These zodiac signs will change their fortunes in 10 days from the 24th october

ధనుస్సు రాశి
బాగా ఉన్నతమైన కుటుంబానికి చెందిన వ్యక్తితో సంబంధం కుదురుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. సంతాన యోగం ఉంది. నిరుద్యోగులకు అవకాశాలున్నాయి. మంచి ఉద్యోగంలోకి ఉద్యోగం చేసేవారు మారతారు.

మిథున రాశి
ప్రేమలో ఉన్నవారి ప్రయత్నాలు, వివాహం చేసుకోవాలనుకుంటున్నవారి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పెళ్ళయినవారికి సంతాన యోగం ఉంది. వ్యాపారస్తులకు, వృత్తిలో ఉన్నవారికి కలిసివస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్థులకు వారి సమర్ధత కారణంగా వేతనాలు పెరుగుతాయి. అంతేకాకుండా వారికి ఊహించనిరీతిలో ప్రాధాన్యం కలుగుతుంది.

సింహ రాశి
కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. వృత్తిలో ఉన్నవారు, ఉద్యోగంలో ఉన్నవారు విదేశాలకు వెళ్లే అవకావం ఉంది. నిరుద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు తలుపుతడతాయి. ఆదాయం కూడా పలు మార్గాల్లో పెరుగుతుంది. కుటుంబ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

మకర రాశి
సీనియర్లకన్నా జూనియర్లకే ఉద్యోగంలో అవకాశాలు వస్తాయి. సొంత ఊరిలోనే ఉద్యోగాలు వస్తాయి. సంపన్నులైనవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. పెద్దల నుంచి ఆస్తులు కలిసివస్తాయి. పోటీ పరీక్షల్లో విజయాలను అందుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+