11న రాధాష్టమి... ఈ రాశులపై వరాల జల్లు.. తడిసి ముద్దవుతారు
ప్రతి సంవత్సరం మనం కృష్ణాష్టమి జరుపుకుంటాం. ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీన ఈ పర్వదినాన్ని జరుపుకున్నాం. కృష్ణాష్టమికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో భాద్రపద మాసంలో శుక్లపక్షం అష్టమి రోజు వచ్చే రాధాష్టమికి కూడా అంతే ప్రాముఖ్య ఉంది. జన్మాష్టమి రోజు కృష్ణుడిని పూజించడం కుదరనివారు రాధాష్టమి రోజు స్వామివారిని పూజించవచ్చు. శ్రీకృష్ణుడికి రాధాష్టమి ఎంతో ప్రీతి. ఆరోజ రాధాకృష్ణులకు ప్రత్యేకమైన పూజలు చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. రాధాష్టమి రోజు రాత్రి 11జ00 గంటలకు రెండు శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ఆరోజు నుంచి కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది.
కుంభరాశి
శ్రీకృష్ణుడి అనుగ్రషహం లభించి అన్ని సమస్యల తీరిపోతాయి. కొత్తగా ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగాల కోసం వెతుకుతున్నవారికి శుభవార్త అందుతుంది. అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన చిన్న చిన్న విభేదాలు తొలగిపోయి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. రుణ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.

మేషరాశి
రాధాష్టమి రోజు నుంచి ఈ రాశివారికి అదృష్టం పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభించడంతో అన్ని పనులు ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. కొత్తగా ఆస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. భాగస్వాముల నుంచి మద్దతు దొరకడంతో పెట్టుబడులు పెడతారు. విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
అనుకున్న పనులన్నీ నెరవేరతాయి. తీసుకున్న అప్పును ఈ సమయంలోనే తిరిగి చెల్లిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు. కొత్తగా ఆస్తులు కలిసివస్తాయి. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించడంతోపాటు ఆర్థికంగా వృద్ధి చెందుతారు.












Click it and Unblock the Notifications