ఈ రాశులవారి జీవితాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి
గ్రహాలకు అధిపతి అయిన అంగారకుడు మరి కొద్దిరోజుల్లో మేష రాశి నుంచి వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అక్కడ 45 రోజులు సంచరించి అనంతరం మిథునరాశిలోకి వస్తాడు. వచ్చే నెలలో రక్షాబంధన్ పండగ ఉంది. ఆ పండగ తర్వాత అంగారకుడి సంచారం జరగడం ప్రధానమైన ఘట్టమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆగస్టులో కుజుడు తన శత్రువు బుధుడికి చెందిన మిథునరాశిలోకి ప్రవేశిస్తుండటం, కుజుడు కూడా అక్కడికే రానుండటంతో కొన్ని రాశులవారి జీవితాల్లో అద్భుతాలు చోటుచేసుకుంటున్నాయి. దీనివల్ల ఏయే రాశులవారికి కలిసిరానుందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశికి అధిపతి కుజుడు కాబట్టి వీరికి బాగా కలిసివస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది. అనుబంధం బలపడుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. కష్టపడి విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ఉద్యోగంలో అనేక బాధ్యతలను నిర్వర్తిస్తారు.

మిథున రాశి
ఈ రాశికి అధిపతి బుధుడు, కుజుడి రాశి మార్పు వీరికి శుభవార్తను మోసుకొస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కలగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగపడి బలపడతారు. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. న్యాయ సంబంధ విషయాలకు సంబంధించి విజయం సాధిస్తారు. కెరీర్ లో కొత్త శిఖరాలను అందుకుంటారు.
సింహ రాశి
మిథునరాశిలో కుజుడు ప్రవేశించడం అనేది వీరికి వరం. వీరు కనే కలలు నిజమవుతాయి. ఉద్యోగాల్లో పనిచేసేవారికి పదోన్నతి ఉంది. ఆరోగ్యం మెరుగపడుతుంది. ఆర్థికంగా లాభం కలగడంతోపాటు స్థితిమంతులు అవుతారు. కుజుడు సంచరించినంత కాలం వీరికి జీవితంలో ఎటువంటి లోటు ఏర్పడదు.
కుంభ రాశి
వీరికి సౌకర్యాలు, సౌఖ్యాలు పెరుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతోపాటు వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు తలుపుతడతాయి.












Click it and Unblock the Notifications