బుధచార ఫలము: పశువులు, బంగారం ధరలు పెరుగును

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బుధాచార ఫలము వివరాలు ఇలా ఉన్నాయి...

వత్సర మొదలుకొని జూన్ 3 వరకు
"మహార్ణం చ చతుష్చదామ్ స్వర్ణం మహార్టతాం యాంతి' పశువులు, బంగారము మొదలగువాటికి ధరలు పెరుగును.

జూన్ 4 నుండి జూన్ 18 వరకు
"మేదినీ నవఖండేషు కలహాశ్చ మహాభయమ్" అంతటను కలహములు, భయములు కలుగును.

జూన్ 19 నుండి జులై 2 వరకు
"తదా వాయుం విజానీయాత్ మేఘశ్చ ప్రబల భవేత్" పెనుగాలి, మేఘాడంబరము సంభవించును.

జులై 3 నుండి జులై 20 వరకు
'తతోత్రి మంగళం లోకే సుభిక్షం జాయతే తదా? అంతటా సుభిక్షముగాను, అత్యంత శుభకరముగాను ఉండును.

జులై 21 నుండి సెప్టెంబరు 26 వరకు
"ధాన్యార్థం చ సమం భవేత్ | సూత్రం చ దేవదారుశ్చ మహారం జాయతే తదా? నూలు, దేవదారు మొదలగు వాటికి ధరలు పెరుగును.

Astrologer described about budhachara phal.

సెప్టెంబరు 27నుండి అక్టోబరు 13 వరకు
"మేఘానా మధిక వ్యాప్తిః | వాతాధిక్యం సమీరితం" మబ్బులు అధికముగా పట్టును. గాలి వానిని చెదరగొట్టును.

అక్టోబరు 14 నుండి నవంబరు 1 వరకు
"మేఘస్య వర్షనం తత్ర మేదినీ కలహాన్వితా" అంతటా కలహములు అధికమగును. అధిక వర్షములు కురియను.

నవంబరు 2నుండి నవంబరు 24 వరకు
అన్ని ధాన్యములకు ధర పెరుగును. కాని ప్రజలు సుఖముగ నుందురు. "హరిద్రాయః పశూనాం చ స్వర్ణస్య చ మహార్టతా" పసుపు, పశువులు, బంగారము మొదలగు వాటికి ధరలు పెరుగును.

నవంబరు 25 నుండి డిశంబరు 10 వరకు
|శ్లో| సుఖ దుఃఖే సమే జ్ఞేయే- సుఖ దుఃఖములు సమానములు.

డిశంబరు 11 నుండి జనవరి 6 వరకు
'హరిద్రాయ8 పశూనాం చ స్వర్ణస్య చ మహార్టతా" పసుపు, పశువులు, బంగారము మొదలగు వాటికి ధరలు పెరుగును.

జనవరి 7 నుండి జనవరి 27 వరకు
సుఖ దుఃఖే సమే జ్ఞేయే - సుఖ దుఃఖములు సమానములు.

జనవరి 28 నుండి ఫిబ్రవరి 14 వరకు
దుర్భిక్షం ప్రచురం భవేత్ | మేదినీ దుఃఖ సంయుకా | కరవు అధికము అగును. ప్రజలు దుఃఖక్రాంతులగుదురు.

ఫిబ్రవరి 15 నుండి మార్చి 2 వరకు
ప్రాగ్గేశే సుభిక్షం - తూర్పు ప్రాంతాలవారికి సుభిక్షము. మార్చి 3 నుండి సంవత్సరాంతము వరకు "మారయేచ్చ హయాన్ గజాన్" గుఱ్ఱములు, ఏనుగులకు హాని.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer described about budhachara phal.
Please Wait while comments are loading...