13వ తేదీ నుంచి ఈ రాశుల పంట పండింది.. కుబేర యోగం పడుతోంది
నవగ్రహాల్లో కీలకమైన గ్రహాలు బుధుడు, శుక్రుడు. గ్రహాలకు రాకుమారుడిలాంటివాడు బుధుడు.. శుక్రుడు సంపదకు, శ్రేయస్సుకు, ధైర్యానికి కారకుడు. ఈ నెల 13న ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి. చాలా అరుదుగా జరిగే ఈ కలయిక వల్ల కొన్ని రాశులవారు ఆర్థికంగా ఓ స్థాయికి చేరుకోబోతున్నారు. వ్యాపారస్తులకు కొంతకాలం నుంచి వేధిస్తున్న సమస్యలన్నీ దూరమవుతాయి. వ్యక్తుల జాతకంలో ఈ రెండు గ్రహాలు శుభస్థానంలో ఉంటే వారికి తిరుగులేదని చెప్పవచ్చు. వారంతా కుబేరులు కాబోతున్నారని పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం.
మిథునరాశి
వీరికి పరిస్థితులన్నీ సానుకూలంగా మారతాయి. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. ప్రమోషన్ వస్తుంది. పెద్దల నుంచి ఆస్తులు కలిసివస్తాయి. ఆర్థికంగా మెరుగుపడతారు. ప్రేమ జీవితం అద్భుతంగా గడుస్తుంది. దాంపత్య జీవితం చాలా సానుకూలంగా గడుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పటిష్టమవుతుంది. అందరూ కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళతారు. వచ్చిన డబ్బును మంచి పెట్టుబడి వచ్చేలా తిరిగి పెట్టుబడి పెట్టడంపైనే మీ విజయం ఆధారపడివుంటుంది.

కన్యా రాశి
ఈ రాశివారికి నిరంతరం బుధుడి నుంచి అనుగ్రహం లభిస్తుంటుంది. జీవితంలో ఎన్నడూ చూడని సంతోషం వ్యక్తమవుతుంది. అందరూ ఆనందంగా కలిసివుంటారు. ఆర్థిక సమస్యలన్నీ సులభంగా దూరమవుతాయి. పెద్దల నుంచి వచ్చే ఆస్తులకు సంబంధించి నడుస్తున్న వివాదాలన్నీ ఈ సమయంలోనే పరిష్కారమవుతాయి. డబ్బు సంపాదనకు అదనపు ఆదాయ మార్గాలు దొరుకుతాయి.
తులారాశి
ఈ రాశివారి జీవితం బాగుంటుంది. వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. మంచి లాభాలుండటంతోపాటు ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు ఈ సమయం బాగా కలిసివస్తుంది. పై అధికారుల నుంచి మద్దతు లభించి మంచి పేరు సంపాదించుకుంటారు. వేతనం పెరుగుతుంది. కార్యాలయంలో కొత్త బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications