18 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ రాశులు ఐశ్వర్యవంతులవుతున్నారు
రాహువు నవగ్రహాల్లో కీలకమైన గ్రహమే కాకుండా నీడ గ్రహం. ప్రతి 18 నెలలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటుంది. అన్ని గ్రహాలతో పోలిస్తే ఎంతో శక్తివంతమైన గ్రహంగా రాహువుకు పేరు. జాతకంలో రాహువు శుభస్థానంలో ఉంటే వారు కోటీశ్వరులవుతారు. శనిదేవుడి సొంత రాశి అయిన కుంభరాశిలోకి రాహువు వచ్చే నెల 18వ తేదీన ప్రవేశిస్తాడు. 18 సంవత్సరాల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంటుంది. దీనివల్ల కొన్ని రాశులవారు మంచి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అన్నివిధాలుగా జీవితంలో స్థిరపడతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
కన్యారాశి
ఉద్యోగాలు చేస్తున్నవారు శుభవార్తలను వింటారు. ఈ రాశివారికి రాహువు సంచారం వల్ల అదృష్టం కలిసివస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో భారీ లాభాలను ఆర్జిస్తారు. ఆర్థిక సంబంధిత విషయాల్లో అప్రమత్తత అవసరం. రాహువు అనుగ్రహంతో అనారోగ్యం తొలగిపోతుంది. అనవసరంగా పెడుతున్న ఖర్చులను సమీక్షించుకొని తగ్గించుకోవాలి. లేదంటే ఆర్థిక నష్టం కలుగుతుంది.

కుంభరాశి
వీరు ఏ విషయాన్నైనా చాలా సులువుగా గుర్తుంచుకుంటారు. దీనివల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు. స్టాక్ మార్కెట్ సంబంధిత రంగంలో పెట్టుబడి పెట్టేవారికి మంచి లాభాలున్నాయి. వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. తెలివితేటలు పెరిగి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి విజయాలను సాధిస్తారు. జీవితంలో మనశ్శాంతిగా ఉంటారు. సంతోషం రెట్టింపు అవడంతోపాటు కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు, విహార యాత్రలకు వెళతారు.
మేషరాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి. ఉద్యోగాలు చేస్తున్నవారికి ప్రమోషన్స్ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఈ రాశివారు చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మాట తీరు విషయంలో వీరు ఎదుటివారికి ఇబ్బంది కలిగించకూడదు. ఈ సమయంలో ఆదాయం పెరగడంతోపాటు ప్రేమ జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా అధిగమిస్తారు.












Click it and Unblock the Notifications