జులై 20 నుంచి ఈ రాశులపై కనక వర్షం కురిపిస్తున్న శుక్రుడు
జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాల్లో కీలక గ్రహమైన శుక్రుడు సంపదకు, ఐశ్వర్యానికి, అందానికి, కళలకు, ప్రతిభకు, కీర్తికి, దాంపత్య జీవితంలో సంతోషానికి, భౌతిక సుఖాలకు, ఫ్యాషన్ రంగాలకు కారకుడు. ఆయన వృషభరాశితోపాటు తులారాశికి కూడా అధిపతి. వచ్చే నెల 20వ తేదీన శుక్రుడు మృగశిర నక్షత్రం ఐదోపాదంలోకి సంచారం చేయబోతున్నాడు. ఆ నక్షత్రానికి అధిపతి కుజుడు. దీనివల్ల మూడు రాశులవారికి అద్భుతమైన యోగాలు కలుగుతున్నాయి. ఏయే రాశులు లాభపడనున్నారనే విషయాన్ని తెలుసుకుందాం.
సింహ రాశి
గతంలో పెట్టిన పెట్టుబడులు, ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు లాభాలనిస్తాయి. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. కుటుంబ సభ్యుల నుంచి ఊహించనిరీతిలో శుభవార్తలను అందుకుంటారు. దాంపత్య జీవితం చాలా శృంగార భరితంగా సాగుతుంది. ఉత్సాహంగా ఉంటూ పనులన్నింటినీ పూర్తిచేస్తారు. మనసు సంతోషంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు కొంత సమయం ఏకాంతంగా గడపాలి.

మిథున రాశి
జీవిత భాగస్వామితో మీ అనుబంధాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడు ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని పనులను సమర్థవంతంగా పూర్తిచేస్తారు. కంటున్న కలలన్నింటినీ నిజం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా మంచి స్థాయి కలుగుతుంది. ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మానసికంగా చాలా ప్రశాంతంగా జీవిస్తారు.
కన్యా రాశి
వృత్తి జీవితంలో ఉన్నవారు చాలా కష్టపడతారు. వారి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మరోవైపు ప్రశంసలు కూడా వస్తాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు దొరుకుతాయి. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేస్తారు. వ్యాపారంలో ఎదగడానికి పుష్కలమైన అవకాశాలు దొరుకుతాయి. దాంపత్య జీవితం అంతా ఆనందంతో నిండిపోతుంది. సమాజంలో హోదా పెరిగి గౌరవ మర్యాదలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రకు వెళతారు.












Click it and Unblock the Notifications