ఈనెల 14న హోలీ తర్వాత ఈ రాశులకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు

నవగ్రహాల్లో కలకమైన గ్రహం శనిదేవుడు. ఆయన న్యాయదేవత. చేసిన కర్మల ప్రకారం మనుషులకు ఫలితాలను ఇస్తుంటాడు. నీతి, నిజాయితీగా ఉండేవారికి రెట్టింపు ప్రతిఫలం ఇస్తాడు. వక్రమార్గంలో పయనించేవారికి అంతకు రెట్టింపు స్థాయిలో వారు చేసుకున్న కర్మల ప్రకారం ఫలితాలొస్తాయి. ఆయన చల్లగా చూశాడంటే ఆ జీవితం ఎంతో హాయిగా, సజావుగా సాగిపోతుంది. మార్చి 14వ తేదీన హోలీ పర్వదినం ఉంది. ఆరోజు నుంచి శనిదేవుడు తన మార్గాన్ని మార్చకోబోతున్నాడు. 29వ తేదీన ఉగాది పర్వదినం ఉంది. అందుకు ముందు శని తన సొంత రాశి అయిన కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల కొందరు రాశిచక్ర గుర్తులకు సంపద పెరుగుతుంది.

కర్కాటక రాశి
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఆర్థికంగా ఇప్పడున్న పరిస్థితి కంటే ఎంతో మెరుగ్గా మారతారు. ఈ సమయం ఈ రాశివారికి బంగారంలాంటిదని చెప్పొచ్చు. ఏ పని తలపెట్టినా సులువుగా విజయాలు సాధిస్తారు. కొన్ని అడ్డంకులున్నప్పటికీ శనిదేవుడి దయవల్ల వాటిని అధిగమిస్తారు. శివాలయంలో నవగ్రహాలకు, ఆంజనేయస్వామి దేవాలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి శనిదేవుడికి తైలాభిషేకం చేయడంవల్ల ఇంకా బాగుంటుంది.

three zodiac signs will get amazing financial benefits due to Saturn will enter pisces

మకర రాశి
ఈ రాశివారికి ఏడున్నర సంవత్సరాలుగా అనుభవిస్తున్న ఏలినాటి శని పూర్తిగా తొలగిపోయి అన్నీ మంచిరోజులే వస్తాయి. అక్కడి నుంచి వీరు మట్టి పట్టుకున్నా బంగారమే అవుతుంది. అంతేకాకుండా తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న ఆస్తి కలిసివస్తుంది. దాంపత్య జీవితంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు పెద్దవయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో అవన్నీ పరిష్కారమవుతాయి. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా జీవిస్తారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి
వ్యాపారస్తులకు వారి కార్యకలాపాల్లో మంచి ఊపు వస్తుంది. అందుకు తగినట్లుగా ఆదాయం వస్తుంది. భారీ లాభాలను ఆర్జిస్తారు. దీనివల్ల కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకుంటుంది. అలాగే కెరీర్ పరంగా ఎన్నడూ చూడని స్థాయికి ఉద్యోగస్థులు చేరుకుంటారు. ప్రస్తుతం చేస్తున్న కార్యాలయంలోనే పదోన్నతి ఉంది. కుటుంబ సభ్యుల్లో కొందరికి పొరపొచ్చాలు ఉన్నప్పటికీ అవి బయటకు కనపడవు. హోలీ తర్వాత అందరూ సఖ్యతగా ఉంటారు. అందరిమధ్య ప్రేమానుబంధాలు వెల్లివిరుస్తాయి. దీనివల్ల ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేయగులుగతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+