బలపడిన శని, బుధుడు.. ఈ రాశులకు అఖండ ధనయోగం

ఈ నెల 17వ తేదీకి చాలా ప్రాముఖ్యత ఉంది. కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు, గ్రహాల రాకుమారుడు బుధుడు వ్యతిరేక దివల్ల 180 డిగ్రీల కోణంలో కలుసుకుంటారు. ఇవే కాకుండా మరికొన్ని గ్రహాలు కూడా కదలికలు జరుపుతున్నాయి. ఈ పరిణామాలవల్ల కొన్ని రాశులవారు అనేక లాభాలను పొందనున్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులకు ఏవిధంగా కలిసి వస్తుందనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

మిథున రాశి
ఉద్యోగాల్లో ఉన్నవారికి, వ్యాపారాలు చేస్తున్నవారికి మానసిక ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. ప్రశాంతంగా ఉంటారు. మానసిక సమస్యలతో బాధపడేవారికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. మంచి లాభాలున్నాయి. సంపద పెరుగుతుంది. పెళ్ళయినవారికి శుభవార్తలున్నాయి. కుటుంబ సభ్యులకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. జీవిత భాగస్వామి నుంచి లభించిన మద్దతుతో అన్నిరకాల పనులు సమర్థవంతంగా పూర్తిచేయగులుగుతారు.

three zodiac signs will get huge money due to Saturn and mercury conjunction 180 degrees angle

కన్యారాశి
విద్యార్థులకు బాగా కలిసివస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఈ సమయంలోనే ప్రయత్నాలు ముమ్మరంగా చేయాలి. కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారాలన్నీ సక్రమంగా సాగుతాయి. బుధుడి దయవల్ల అనేక పనులు చేయగలుగుతారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు శనిదేవుడికి తైలాభిషేకం, బుధుడికి పూజ చేయించుకుంటే చాలా మంచిది.

మకర రాశి
ఈ రాశివారికి తెలివితేటలు పెరుగుతాయి. వివాహానికి ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. గతం నుంచి అనుకుంటున్న పెండింగ్ పనులు కూడా పూర్తిచేయగలుగుతారు. కష్టపడి పనిచేసేవారికి మంచి ప్రతిఫలాలు లభిస్తాయి. ప్రేమను కురిపిస్తారు. అందరూ సంతోషంగా ఉంటారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి బుధుడిని, శనిని పూజించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+