ఏడాది తర్వాత బుధాదిత్య రాజయోగం.. జమిందారులవుతున్న రాశులు వీరే

గ్రహాల రాకుమారుడైన బుధుడు దాదాపు ఏడాది సమయం తర్వాత బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈనెల 15వ తేదీన సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే అక్కడ బుధుడు ఉండటంతో ఈ యోగం ఏర్పడుతోంది. జ్యోతిష్యం ప్రకారం ఇది చాలా కీలకమైన యోగం. గ్రహాలు ఇలా రాశి సంచారం చేసే సమయంలో శివయోగాలు కూడా ఏర్పడుతుంటాయి. వీటి ప్రభావంవల్ల మానవుల వ్యక్తిగత జీవితాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈనెల 14వ తేదీన హోలీ పర్వదినం ఉంది. ఒకరోజు తర్వాత సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల ఏర్పడే బుధాదిత్య యోగంతో ఏ రాశుల జీవితాల్లో మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసుకుందాం.

వృషభరాశి
ఈ రాశివారికి ఆదాయం భారీగా పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో భారీ లాభాలను అందుకుంటారు. అలాగే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నవారికి, ఎదురుచూస్తున్నవారికి ఇది మంచి సమయం. పెట్టిన పెట్టుబడుల నుంచి భవిష్యత్తులో మంచి ఆదాయం రానుంది. ఒకరకంగా ఈ రాశివారికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు సూర్యభగవానుడికి పూజలు చేస్తే మంచిది.

three zodiac signs will get lot of benefits and financial benefits due to budhaditya rajayogam from march 15th

మిథునరాశి
నిరుద్యోగులకు వారు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. కుటుంబానికి ఆసరాగా నిలుస్తారు. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. జీవితంలో ఆర్థికంగా స్థిరపడతారు. సమస్యల నుంచి బయటపడి మనశ్శాంతిగా ఉంటారు. అన్నివైపుల నుంచి ఆదాయాన్ని సంపాదించేందుకు వనరులు అందుబాటులోకి వస్తాయి.

కుంభరాశి
ఆకస్మికంగా వీరికి ధనలాభం ఉంది. వ్యాపారస్తులకు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు భారీగా పెరుగుతాయి. ఆ స్థాయిలో లాభాలను ఆర్జిస్తారు. శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్యంతో ఉంటారు. వీరికి తెలియకుండానే కలిసివస్తుంది. అన్నివిధాలుగా బాగున్నప్పటికీ కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయి. చేసే పనుల నుంచి వెనక్కి లాగేవారున్నారు. దానిమీద నమ్మకంతో మొదలుపెట్టిన పనిని మధ్యలో వదిలేయకుండా పూర్తిచేయగలిగినప్పుడు మంచి విజయాన్ని అందుకొని సమాజంలో పేరు ప్రతిష్టలతోపాటు ధనాన్ని సంపాదించుకోగలుగుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+