వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరలక్ష్మీ వ్రత విధానం: ఎప్పుడు చేయాలి?.. ఎలా వచ్చింది?

జమ్ము కాశ్మీర్ అనంత నాగ్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య శుక్రవారం కాల్పులు చోటు చేసుకున్నాయి. యావర్ అనే ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకున్నారు. కూంబింగ్ కొనసాగుతోంది.

|
Google Oneindia TeluguNews

వ్రతకథ పరమశివుడు, పార్వతీదేవికి చెప్పిన పూజ ఇది.

శ్రావణమాసంలో పన్నమికి ముందు వచ్చే శుక్రవారం సిరిసంపదలను కురిపించే శ్రీ వరలక్ష్మీవ్రతాన్ని ఆచరిస్తారు.నూతన వధువులు మాత్రమే గాక ఇంటిల్లిపాదీ శుభప్రదంగా జరుపుకునే వ్రతం శ్రీ వరలక్ష్మీవ్రతం!

ఎప్పుడు చేయాలి

ఒకవేళ శ్రావణమాసంలో పున్నమినాటికి ముందు వచ్చెశుక్రవారంనాడు వరలక్ష్మీవ్రతాన్ని ఆచరించడానికి వీలుకలగనివారు, అదే శ్రావణమాసంలో తర్వాత వచే ఏ శుక్రవారమైనా వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోవచ్చు. అప్పడు కూడాప కారణాల వల్లో, ఏ ఇబ్బందుల వల్లో శ్రావణమాసంలోవరలక్షీ ప్రతాన్ని ఆచరించలేకపోయినవారు, ఆ వెనువెంటనే వచే ఆశ్వయుజమాసంలో దేవీనవరాత్రుల్లో వరలక్ష్మీవ్రతాన్ని చెయ్యవచ్చని అందరూ అమావాస్య దీపావళినాడైనా ఈ వ్రతాన్ని నిర్వహించవచునని కొందరిపెద్దలమాట!

వ్రతం ఎలా వచ్చింది ?

ఉన్న కుండిననగరం పాడి పంటలకు, ధాన్యపురాశులకు, రత్నాలరాశులకు పుట్టినిల్ల. ఈ నగరంలోని ప్రతి లోగిలీ అష్ట ఐశ్వర్యాలతో కళకళలాడుతూ శ్రీ మహాలక్ష్మి సన్ని ధానంలా దర్శనమిచ్చేది. ప్రతి ఇల్లాలూ సౌభాగ్య చిహ్నాలు ధరించి మహాలక్ష్మిగా దర్శనమిచ్చేది.

ఆ కుండిననగరంలో చారుమతి అనే ఇల్లాలుచుక్కల్లో చంద్రునిలాగా చక్కటి వర్చస్సుతో ప్రకాశిసూ ఉండేది. ఆ యువతి భర్తకూ, అత్తమామలకూ నిత్యమూ సపర్యలు చేసూ మంచి గృహిణి అన్న పేరు తెచ్చుకుంది. ప్రతిరోజు తెల్లవారు జామునే స్నానాదుల నాచరించి పుణ్యకార్యాలను నిర్వహించుకొంటున్న గుణవతి అయిన చారుమతికి ఒకనాడు కలలో శ్రీమహాలక్ష్మి ప్రత్యక్ష్యమైంది.

Varalakshmi vratham pooja procedure

"ఓ చారుమతీ! సచ్చీలవతీ! పవిత్రమైన నీ నడతకు, పెద్దలకు వినయవినమ్రతతో నీవు చేస్తున్న సపర్యలకు చాలా సంతోషం కలి గింది. గృహలక్ష్మివైన నీ మీద నాకు అనుగ్రహం కలుగుతున్నది. నేను సకలవరాలను ఇట్టే అనుగ్రహించగల "వరలక్ష్మీదేవి"ని. అందువల్ల నేను ఆదేశించినట్లుగా నీవు "వరలక్ష్మీ వ్రతం" అనే వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించు. వచ్చే శ్రావణమాసంలో పన్నమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ ప్రతాన్ని నియమనిష్టతో నిర్వహించుకో?'' అని లక్ష్మీదేవి కలలో ఉపదేశించింది.

చారుమతి ఆ కలలోనే తనకు ప్రత్యక్షమైన మహాలక్ష్మికి ప్రదక్షిణ నమస్కారాలను భక్తిపూర్వకంగా సమర్పించింది.
వెంటనే నిద్ర నుండి మేల్కొన్న చారుమతి భర్తకు, అత్త మామలకు తన దివ్య స్వప్నవృత్తాంతాన్ని శ్రీ మహాలక్ష్మి ఆదేశాన్ని తెలియజేసింది. వారల అనుమతితో వరలక్ష్మీ వ్రతా చరణకు దీక్ష పూనింది. ఆ వ్రతానికి కావాల్సిన సంభారాలను, పూజాద్రవ్యాలను సమకూర్చుకొంది. ఇంతలో శ్రావణమాసం రానే వచ్చింది.

పున్నమినాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు చారుమతి ఆమె స్నేహితురాండ్రు ఈ రోజే గదా "వరలక్ష్మీ వ్రతం ఆచరించవలసిన రోజు అని అందరూ తెల్లవారుజామునే నిద్రలేచారు. అభ్యంగన స్నానాదులను పూర్తిచేసికొని రంగురంగుల పట్టుచీరలను ధరిం చారు. ఇలాగా పుణ్యస్త్రీలతో కూడిన చారుమతీదేవి తమ ఇంటిలో దేవుని మూలన అనగా ఈశాన్యభాగాన ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టింది.

అచ్చోట ఒక మండపాన్ని ఏర్పాటుచేసింది. ఆ మండపంలో కొత్తబియ్యం పోసి అష్టదళపద్మంగా తీర్చిదిద్ది, ఆ బియ్యంపై నిండుగా జలాన్ని సేకరించిన కలశాన్ని అందులో పంచపల్లవాలని పేరు పొందిన మర్రి, మామిడి, మేడి, జువ్వి, రావి చిగుళ్లను ఉంచింది. ఆ కలశంపై పూర్ణఫలమైన నారికేళాన్ని దానిపై ఎర్రటి రవిక గుడ్డను అలంకరించింది. ఆ కలశం ముందు భాగంలో లక్ష్మీదేవి ముఖకవచాన్ని శోభాయమానంగా ఏర్పాటు చేసింది. ఆ కలశంలో విధివిధానంగా జగన్మాత అయిన వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసింది.

శ్రీ వరలక్ష్మిని కీర్తిస్తూ చారుమతీదేవి, ఆవాహనం చేసిన వర లక్ష్మిని ధ్యాన ఆవాహ నాది షోడశోపచారాలతో, అష్ణోత్తరశత నామాలతో అర్చించి అనేక విధాలైన భక్ష్యాలను, పిండివంటలను, ఫలాలను నైవేద్యంగా సమర్పించి, తొమ్మిది దారాలతో తయారు చేయబడిన తోరాన్ని అర్చించి, దాన్ని కుడిచేతికి కట్టుకుని భక్తిగా ప్రదక్షిణ, నమస్కారాలు సమర్పించింది.

ఫలితం

మొదటి ప్రదక్షిణం చేసి నమస్కారం చెయ్యగానే చారుమతీ దేవికి, తోటి పుణ్యస్త్రీలకందరికి కాళ్లయందు ఘల్లుఘల్లన ఫ్రెమోగే గజైలు కలిగాయి. ఇది గమనించిన చారుమతి, మిగిలిన స్త్రీ లందరు, ఓహో! వరలక్ష్మీదేవి అనుగ్రహం వెనువెంటనే ప్రత్యక్షంగా గోచరించింది కదా అని ఆనందిసూ మిగిలిన రెండు, మూడు ప్రదక్షిణలు కూడా పూర్తి చేశారు.

అంతే! చారుమతికే గాక అక్కడ స్త్రీలకందరికి శరీరమంతటా ఆపాదమస్తకం నవరత్నాలు పొదిగిన బంగారుహారాలు ఏన్నో ఎన్నెన్నో అలంకరింపబడడమే గాక ఆ స్త్రీలందరి ఇండ్లుకూడా సమస్తసంపదలతో తులతూగాయి. రథ గజ, తురగ వాహనాలతోవారి ఇండ్లు నిండిపోయాయి.

ఆ తర్వాత చారుమతి శాస్త్రోక్తంగా వరలక్ష్మీవ్రతాన్ని నిర్వ హింపచేసిన పురోహితుణ్ణి చందన పుష్పాక్షతలతో అర్చించి దక్షిణ తాంబూలాలను సమర్పించి సంతృప్తిపరచింది. ఆ తరువాత అందరూ వరలక్ష్మీదేవి ప్రసాదాన్ని తృప్తిగా కడుపార భుజించి,

ఆహా! చారుమతీదేవి గొప్పదనమేమిటి? ఎంతటి సౌశీల్యవతి! ఆమె దయవల్లనే కదా మనకందరికి వరలక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది అనుకుంటూ చారుమతి మహాభాగ్యాన్ని కొనియూదుతూ ఆమె అనుమతిని, ఆశీస్సులను స్వీకరించి వారి వారి ఇండ్లకు ఆనందంగా వెళ్ళారు.

ఇలాగ చారుమతీదేవి ద్వారా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లోకానికి అందించిన శ్రీ వరలక్ష్మీవ్రతాన్ని పార్వతీదేవికి పరమే శ్వరుడు తెలియజేశాడు.

ఏది ఏమైనా శ్రావణమాసంలో వీలుకాని సందర్భంలో మాత్రమే మహిమాన్వితమైన వరలక్ష్మీవ్రతాన్ని వదలిపెట్టకుండా గృహిణులు ఆశ్వయుజమాసంలో నిర్వహించడం శుభకరం.

English summary
Here is the detailed varalakshmi vratham pooja procedure or method with puja vidhi with mantras, list of items required
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X