వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: ఇంట్లో పడకగది అక్కడ లేకుంటే భార్యాభర్తల మధ్య గొడవలే..!!

|
Google Oneindia TeluguNews

రోజంతా కష్టించి పనిచేసిన వారికి విశ్రాంతి తీసుకోవడానికి, సుఖంగా నిద్ర పోవడానికి, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన గది పడకగది. ఇంట్లో ఉండే ప్రతి గదికి ఒక ప్రాధాన్యత ఉన్నట్టే బెడ్ రూమ్ కు కూడా అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇక బెడ్ రూమ్ కి సంబంధించిన వాస్తు ఏ విధంగా ఉండాలి? ఏ దిశలో బెడ్ రూమ్ ఉంటే సుఖంగా నిద్రపడుతుంది? భార్య భర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా జీవితం సాఫీగా సాగాలంటే బెడ్ రూమ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అనేది ఈ స్పెషల్ ఫీచర్ లో

బెడ్ రూమ్ విషయంలో వాస్తు నియమాలు పాటించాలి

బెడ్ రూమ్ విషయంలో వాస్తు నియమాలు పాటించాలి

వాస్తు శాస్త్రం జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకుంటే, మా ఇంట్లో ఉన్న వాళ్ళు సుఖసంతోషాలతో జీవిస్తారు. ముఖ్యంగా బెడ్రూమ్ విషయంలో తప్పనిసరిగా వాస్తు నియమాలు పాటించి తీరాలి. బెడ్రూమ్ విషయంలో ప్రతి ఒక్కటి మన జీవన విధానంపై ప్రభావం చూపిస్తాయి. బెడ్ రూమ్ లో పెట్టిన వస్తువుల దగ్గర నుండి, గదికి వేసే రంగుల వరకు ప్రతి ఒక్కటి అత్యంత ముఖ్యమైనవిగా చూడవలసిందే. ముఖ్యంగా బెడ్ రూమ్ ల విషయానికి వస్తే

బెడ్ రూమ్స్ ఉండాల్సిన దిశలు ఇవే..

బెడ్ రూమ్స్ ఉండాల్సిన దిశలు ఇవే..

మాస్టర్ బెడ్‌రూమ్.. ఇది ఇంటికి నైరుతి మూలలో ఉండాలి. కుటుంబ పెద్దలు ఈ బెడ్రూంలో నిద్రించే లాగా డిజైన్ చేసుకోవాలి. లేత రంగులు ఎప్పుడూ మనసుకి ఆహ్లాదాన్ని, సుఖవంతమైన నిద్రను ఇస్తాయి కాబట్టి. అటువంటి రంగులని బెడ్ రూమ్ కు వేసుకోవడానికి సెలెక్ట్ చేసుకోవాలి. పిల్లల పడకగది విషయానికి వస్తే పడమర ముఖంగా ఉండే గది పిల్లల గదిగా ఉండాలి. అతిథి పడకగది విషయానికి వస్తే తూర్పు ముఖంగా ఉండే గదులు అతిథి గదులుగా ఉండాలి.

పడకగది ఆగ్నేయంలో ఉంటే భార్యాభర్తల మధ్య కలహాలు

పడకగది ఆగ్నేయంలో ఉంటే భార్యాభర్తల మధ్య కలహాలు

ఇక స్టడీ రూమ్ విషయానికి వస్తే చదువుకోవడానికి మరియు పని చేయడానికి ఆగ్నేయ మూలను కేటాయించాలి.వాస్తు శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం, మాస్టర్ బెడ్‌రూమ్‌ను నిర్మించడానికి అనువైన దిశ ఇంటికి నైరుతి మూల. మాస్టర్ బెడ్‌రూమ్‌ను ఈశాన్య దిశలో నిర్మించడాన్ని ఎప్పుడూ చెయ్యరాదు. ఎందుకంటే అది పూజా గదికి కేటాయించబడింది. అదేవిధంగా, ఆగ్నేయ దిశ అనువైనది కాదు, ఎందుకంటే ఇది "అగ్ని" చేత నిర్వహించబడుతుంది. ఇది జంటల మధ్య కలహాలు మరియు అపార్థాలకు దారితీస్తుంది.

బెడ్ రూమ్ డోర్ దక్షిణం వైపు ఉండరాదు

బెడ్ రూమ్ డోర్ దక్షిణం వైపు ఉండరాదు

పడకగది ప్రవేశ ద్వారం వద్దకు, తలుపు ఉత్తరం, పడమర లేదా గోడలకు తూర్పు వైపున ఉండాలి. తలుపు ఎప్పుడూ దక్షిణం వైపు గోడపై ఉండకూడదు. ఒకే తలుపులు పడకగదికి అనువైనవని చెప్తున్నారు. తలుపుకు సరిగ్గా ఎదురుగా మంచం ఎప్పుడూ ఉంచవద్దు. తూర్పు లేదా దక్షిణం వైపు తల పెట్టి నిద్రించడం మంచిది. ఈ స్లీపింగ్ దిశ మీకు మంచి నిద్ర వచ్చేలా చేస్తుంది . దీర్ఘకాల జీవితాన్ని అందిస్తుంది. మంచం మీద ఎటువంటి బీమ్ క్రాసింగ్ ఉండకూడదు. అలాగే, మీ బెడ్ ఆకారం రెగ్యులర్‌గా ఉండేలా చూసుకోండి.

బెడ్ తయారీలోనూ క్రమరహిత ఆకృతులు వద్దు

బెడ్ తయారీలోనూ క్రమరహిత ఆకృతులు వద్దు


ఏదైనా క్రమరహిత ఆకృతులను బెడ్ విషయంలో నివారించాల్సిన అవసరం ఉంది. ప్రశాంతమైన నిద్ర కోసం, విశ్రాంతి కోసం పడకగది విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా పడకగదిలో ఉంచాల్సిన వస్తువులు, ఉండకూడని వస్తువులు ఏంటి? తదితర వివరాలు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. పడకగది దిశల వాస్తు గురించి, బెడ్ రూమ్ ఎలా ఉంటే జీవితం సుఖంగా ఉంటుందో తెలుసుకుని మంచి వైబ్ లను ఇంట్లోకి స్వాగతించండి.

English summary
The bedroom in the house should be on the southwest side of the house. Otherwise there is a risk of conflicts between the wife and husband, if the bedroom is not in the right direction. So architecture should be given priority in the case of bedrooms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X