వాస్తు ప్రకారం దక్షిణంవైపు ఇవి చేసి ఆర్థికంగా స్థిరపడండి
సాధారణంగా చాలామంది దక్షిణ దిశ అనగానే భయానికి, అపోహలకు లోనవుతుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం, దక్షిణ గోడను సరైన పద్ధతిలో తీర్చిదిద్దుకుంటే, అది మీ జీవితంలో అంతులేని ధైర్యాన్ని, స్థిరత్వాన్ని, ఆర్థికస్థితిని, అద్భుతమైన కెరీర్ వృద్ధిని ప్రసాదిస్తుంది. దక్షిణ దిశను మీ విజయానికి సోపానంగా మార్చుకునేందుకు అనుసరించాల్సిన సరికొత్త చిట్కాలను తెలుసుకుందాం.
వాస్తు ప్రపంచంలో దక్షిణ దిశ అంటే క్రమశిక్షణ, అధికారం బాధ్యతకు నిలయం. మీ ఇంట్లోని దక్షిణ గోడ కేవలం ఒక గోడ మాత్రమే కాదు, అది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక అస్త్రం. అక్కడ మీరు ఉంచే ప్రతి వస్తువు మీ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంది. దక్షిణ గోడపై ఒక చిన్న వెలుగు ఉండేలా చూసుకోండి. ఇది ఆ దిశలోని శక్తిని మరింత రెట్టింపు చేస్తుంది.

ఉండాల్సినవి
జీవితంలో వేగంగా ఎదగాలని కోరుకుంటే, దక్షిణ గోడపై ఈ క్రింది చిత్రాలను అమర్చండి
ఏడు గుర్రాలు వేగంగా పరిగెడుతున్న చిత్రం మీ జీవితంలో నిరంతర పురోగతికి, శక్తికి సంకేతం.
మంచు లేని, పచ్చని లేదా రాతి పర్వతాల చిత్రాలు మీ జీవితంలో, వృత్తిలో "స్థిరత్వాన్ని" ఇస్తాయి.
ఉదయిస్తున్న సూర్యుని చిత్రం మనసులో కొత్త ఉత్సాహాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది.
స్ఫూర్తినిచ్చే గొప్ప నాయకులు లేదా చారిత్రక యోధుల చిత్రాలు మీకు నిర్ణయాధికారాన్ని, ధైర్యాన్ని ప్రసాదిస్తాయి.
పెట్టకూడనివి
దక్షిణ దిశ 'అగ్ని' తత్వానికి సంబంధించినది. కాబట్టి, ఈ తత్వానికి విరుద్ధంగా ఉండేవి ఇక్కడ ఉంచకూడదు
నదులు, జలపాతాలు, సముద్రాలు లేదా ఈత కొడుతున్నట్టు ఉండే ఫోటోలు ఇక్కడ పెట్టకండి.
ఇది మీ కెరీర్‌లో ఆటంకాలు కలిగించవచ్చు.
ఏడుస్తున్నట్టు ఉన్న బొమ్మలు, యుద్ధం, హింస లేదా ఒంటరితనాన్ని
ప్రతిబింబించే చిత్రాలు ఇంట్లో నెగటివ్ ఎనర్జీని పెంచుతాయి.
సూర్యుడు అస్తమిస్తున్న ఫోటోలు ఉత్సాహాన్ని తగ్గించి, నిరుత్సాహానికి దారితీస్తాయి.
రంగుల మాయాజాలం
దక్షిణ గోడకు వేసే రంగు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
ఎరుపు, గాఢ నారింజ, మరూన్ లేదా మట్టి రంగు వంటి గట్టి రంగులు ఈ దిశకు బలాన్నిస్తాయి.
నీలం లేదా నలుపు రంగులను ఇక్కడ వాడకపోవడం మంచిది, ఎందుకంటే ఇవి జల తత్వానికి ప్రతీకలు.
కుటుంబం, కెరీర్ కోసం
మీరు ఒకవేళ కుటుంబ ఫోటోలు పెట్టాలనుకుంటే,
అందరూ నవ్వుతూ ఆనందంగా ఉన్న 'కలర్' ఫోటోలను మాత్రమే ఎంపిక చేయండి.
దక్షిణ గోడను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి.
అక్కడ పాత సామాన్లు, విరిగిన వస్తువులు లేదా
పనికిరాని పాత ఫోటోలను ఉంచడం వల్ల ప్రగతి కుంటుపడుతుంది.












Click it and Unblock the Notifications